ద్విపద
( విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి అలంకార రూపములను ప్రస్తుతిస్తూ )🙏
కీర్తన :- // కరుణాంబు రాశి శ్రీ కనకదుర్గమ్మ //🌹
*కరుణాంబు రాశి శ్రీ కనకదుర్గమ్మ*
*ధరనందరినిఁ బ్రోవ దయచేయవమ్మ !*
*// కరుణాంబు రాశి శ్రీ కనకదుర్గమ్మ //*
*మేలిమి బంగారు మిరుమిట్లు గురియ*
*బాలవై యలరించు ఫాలలోచనిగ !*
*పంచవదనమాకు బరమంబు దెల్పు*
*మంచియ గట్టితి మన్నపూర్ణవని !!*
*// కరుణాంబు రాశి శ్రీ కనకదుర్గమ్మ //*
*శ్రీలలితాంబవై శ్రీసరస్వతిగ ,*
*యేలుకో మహలక్ష్మి యిందిరా రమణి*
*దుర్గతులను బాపు దుర్గవై నిలిచి*
*మార్గదర్శివినీవె మహిషమర్దినివి*
*// కరుణాంబు రాశి శ్రీ కనకదుర్గమ్మ //*
*నవదుర్గ పాహిమాం నవనీత హృదయ*
*జవమునింపవె భువిజనకోటికెల్ల*
*రాజరాజేశ్వరి రాజిల్లవమ్మ*
*నీ జాలి జూపుమా నీరాజనములు !!*
*// కరుణాంబు రాశి శ్రీ కనకదుర్గమ్మ //*
🌹🙏🌹
✍️ *--వేణుగోపాల్ యెల్లేపెద్ది*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి