*🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం,61వ శ్లోకం*
*తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |*
*వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 61*
*ప్రతి పదార్థం*
తాని, సర్వాణి =ఆ సమస్తములైన ఇంద్రియములను ; సంయమ్య = వశము నందుంచుకొని; యుక్తః = సమాహిత చిత్తుడైన వాడు; మత్పరః = మత్పరాయణుడై; ఆసీతః = ధ్యానము నందు కూర్చోనవలెను; హి = ఏలనన ; యస్య = ఎవని యొక్క ; ఇంద్రియాణి = ఇంద్రియములు; వశే = వశమునందు ( ఉండునో ); తస్య = అతని యొక్క ; ప్రజ్ఞా = బుద్ధియే; ప్రతిష్థితా = స్థిరమై యుండును .
*తాత్పర్యము*
కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశమునందుంచుకొని, సమాహిత చిత్తుడై ( చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేసినవాడై ) మత్పరాయణుడై, ధ్యానమునందు కూర్చొన వలెను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొనువాని బుద్ధి స్థిరముగా నుండును.
*సర్వేజనాః సుఖినోభవంతు*
*హరిః ఓం 🙏*🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి