🌻అక్షయతృతీయ పర్వదినము 🌻
సీ. జమదగ్ని పుత్రుడై జగతిలో విష్ణువు
రాముడై పుట్టిన రమ్య దినము
పావనగంగమ్మ ప్రవహించి సాగియు
న్నుర్విని తాకిన పర్వ దినము
రఘురామచంద్రుండు రాజ్య మేలినయట్టి
త్రేతాయుగారంభ దివ్య దినము
చిననాటి మిత్రుని శ్రీకృష్ణపరమాత్మ
కూర్మి తోడను కల్సుకొనిన దినము
గణపతి సాయాన ఘనుడగు వ్యాసుచే
భారతమ్మొదలై న పర్వ దినము
భాను డక్షయపాత్ర పాండవాగ్రజునకు
దీవించి యిచ్చిన దివ్య దినము
శంకరాచార్యుండు సంపద కొరకునై
కనకధారాస్తుతి న్ననిన దినము
అన్నపూర్ణాదేవి యవతార మెత్తియున్
నాహారమిడినట్టి యాది దినము
పరమాత్మకృష్ణుండు పాంచాలిని సభలొ
కాచి రక్షించిన ఘన దినమ్ము
తే. దివ్యమైన యీ "అక్షయతృతియ దినము"
బహువిధమ్ముల గమనించ పర్వదినము
పుణ్య కర్మల నీ వేళ పూని చేయ
శాంతి సిరి సంపద లమరు సత్వరముగ.
✍️గోపాలుని మధుసూదనరావు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి