వైశాఖమాసం శుద్ధ తదియ "అక్షయ తృతీయ"గా భావిస్తారు.."అక్షయం" అంటే నాశనం లేనిది..
.కానిది...అని అర్థం..ఈ రోజున ఏ మంచి పని చేసినా దాని వలన కలిగే పుణ్యం "క్షయం" కాదు..ఈ రోజున "బంగారం"కొంటే మంచిది అంటారు..అది ఎలాగంటే.. కొని బీరువాలో దాచడం కాదు.కొనుగోలు చేసిన బంగారాన్ని "దానం" చేయాలి..అప్పుడు కీర్తి పెరుగుతుంది..వెండి పాత్రలో గానీ,"రాగి" పాత్రలో గానీ,నీళ్ళు పోసి దానిలో "తులసీ దళాలు"వేసి దానం చేస్తే ఆ కుటుంబం లోని పిల్లలకు త్వరగా వివాహాలు అవుతాయని శాస్త్ర వచనం..దానం చేయడం వలన అధిక ఫలం వస్తుంది..కానీ కొనడం వలన కాదు. ధన సంపదనను ఇచ్చే మంత్రం...."కుబేరత్వం ధనాదీశ గృహేతే కమలా స్తితా తాం దేవాం , తేషుయా సుసమృద్ధిత్వం మద్ గృహేత్ నమో నమః..." ఇది ఐశ్వర్య ప్రాప్తి మంత్రం..రోజుకు నిష్టగా108 పర్యాయములు"మండలం" రోజులు (40) జపిస్తే ఐశ్వర్యం లభిస్తుంది...ఈ తిథి నాడు అక్షతోదకంతో స్నానం చేసి,అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి,అర్చించి,ఆ తరువాత ఆ బియ్యాన్ని మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి ,మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణో చ్చిష్టంగాతలచి ,వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి" అక్షయ తృతీయ" ఫలం లభిస్తుందట.."రాజసూయ యాగం" చేసిన ఫలం లభిస్తుందట..అంత్యమున "జీవన్ముక్తి" లభిస్తుందట....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి