10, మే 2024, శుక్రవారం

పదభ్రమర ప్రహేళిక

 పదభ్రమర ప్రహేళిక (Puzzle of palindromes)


ఇది ఓ పది పాదాల సీస పద్యంలో నిక్షిప్తంగా వున్న ఓ ప్రహేళిక. పది ప్రశ్నలున్న 'పదభ్రమర ప్రహేళిక' (Puzzle of palindromes). అన్నింటికి సమాధానం ఐదక్షరాల పదాలు. ఇవి 'రెండు వైపుల నుంచి చదివినా అదే పదం' అని వేరే చెప్పనక్కరలేదు. 'Palindrome' అంటే అంతే గదా! ప్రయత్నించండి. మీకు తట్టకపోతే.. క్రింద సమాధానాలు చూడండి. తెలుగు భాష లోని మాధుర్యాన్ని చవి చూడండి.


ఏమి చేయక వృధా యేటి నీరేగును ?


రాముడెవ్వరి గూడి రావణు మర్దించె ?


సీతను చేకొన జెరచిన ధనువేది ?


సభవారి నవ్వించు జాణ యెవడు ?


శ్రీ కృష్ణుడే యింట చెలగుచుండె ?


భూపాలుడేటికి పుట్టువొందెను ?


కలహంస నివసించు కాసారమెయ్యది ?


వీరుడెద్దానిచే విజయమందు ?


లజ్జ యెవ్వరి అమూల్యపుటలంకారము ?


దేవాంగులకు దేన జీవనంబు ?


అన్నిటికి చూడ వైదేసి అక్షరములు ఒనర నిరుదెస చదివిన యొక్కతీరె చెప్పగలిగిన నేనిత్తు చిన్న మాడ! చెప్పలేకున్న నవ్వుదు చిన్న నవ్వు.


ఎంత చక్కనిదోయి మన తెలుగు తోట.


2. తోకమూకతో


సమాధానాలు:


1. కట్టకట్టక


5. నందనందనం.


9. కులస్త్రీలకు


6. నేలనేలనే


10. చేతనేతచే.


3. పంచాస్త్రచాపం


7. సురసరసు


4. వికటకవి.


8. చేతిహేతిచే

కామెంట్‌లు లేవు: