7, మే 2022, శనివారం

సప్తమీ భానునాయుతా

 రేపు అనగా 8.5.2022 తేదీ రోజున ఆదివారం, సప్తమి, పుష్యమి నక్షత్రం కలసి ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది.


"అమావాస్యేతుసోమేన సప్తమీ భానునాయుతా చతుర్థీ భౌమవారేణ సూర్యగ్రహణసన్నిభా:!స్నానందానంతథాశ్రాద్ధం సర్వంతత్రాక్షయంభవేత్!! తిథివార సమాయోగో యదాకాలేభవేదిహ/ప్రభాతేవాథ మధ్నాహ్న పుణ్యకాలన్సనాస్యదా ?


తా॥ సోమవారముతోగూడిన ఆమావాస్య, ఆదివారముతోగూడిన సప్తమి, మంగళవారముతోగూడిన చవితి, బుధవారముతోగూడిన అష్టమి,


ఈ నాలుగింటికి మహాపర్వత యోగములు అని పేరు. ఇవి సూర్యగ్రహణతుల్యములు.


ఈరోజుల్లో చేసిన గంగాస్నానము, దానం జపం ఉపాసన శ్రాద్ధము.. మొ||వి అక్షయ ఫలాన్ని ఇస్తాయి.


శ్లో॥"" సంక్రాన్తిషు వ్యతీపాతే గ్రహణే చన్ద్రసూర్య్యయోః, పుష్యే స్నాత్వాతు జాహ్నవ్యాం కులకోటి: సముద్ధరేత్.." అని బ్రహ్మాణపురాణమ్"


పుష్యమి నక్షత్ర యుక్తమైన ఈ రోజు గంగా స్నానం


చేయడం వల్ల వంశం పావనం అవుతుందని అర్థం.


"శృణు రాజన్ ! ప్రవక్ష్యామి పుష్యస్నానవిధిక్రమమ్ యేన విజ్ఞాతమాత్రేణ విఘ్నా నశ్యని సన్తతమ్.. ఖానౌ పుష్యర చ పుష్యస్నానం నరశ్చరేత్, సౌభాగ్యకల్యాణకరం దుర్భిక్షమరకాపహమ్.. గ్రహదోషాశ్చ జాయనే యది రాజ్యేషు చేతయః, తదా పుష్యర్క మాత్రే తు కుర్య్యానాసా రేవ్ తల్


అంటూ శాస్త్ర గ్రంథాలు చెబుతున్న దాన్ని బట్టి..


ఈరోజు చేసే గంగాస్నానం వల్ల ఎంతో కాలంగా ఉన్న విఘ్నాలు, గ్రహదోషాలు, ఆర్థిక బాధలు తొలగిపోయి సౌభాగ్య కళ్యాణ కరమైన మంచి ఫలితాలు సిద్ధిస్తాయని అర్థం.


గౌతమఋషి తపస్సువల్ల గంగాదేవియే గోదావరిగా అవతరించి కాబట్టి ఈరోజు గోదావరి స్నానం.. వీలైనంత భగవత్ ఆరాధన, దానం వంటివాటి వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.


గమనిక ఏమిటంటే.. ఇలాంటి ప్రత్యేక యోగాలు ఉన్న రోజుల్లో చేసే పాపాలు, లేదా తప్పుడు పనుల యొక్క దోషఫలం కూడా అనేక రెట్లుగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కామెంట్‌లు లేవు: