🕉️ *శివునికి సోమవారమే ఎందుకు?* 🕉️
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
శివున్ని పూజించే భక్తులంతా సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం సహజం.
ఆ రోజునే ఉపవాసం ఉంటారు చాలామంది.ఎందుకని..? అంటే…. సోముడు అంటే చంద్రుడు. మనకు ఉన్న వారాల పేర్లన్నీ గ్రహాలను అనుసరించి వచ్చాయి. చంద్రుని వారం సోమవారం.
చంద్రుని ధరించినవాడు శివుడు.
చంద్రుడే సోముడు కనుక శివుని చంద్రశేఖరుడు అనీ, సోమశేఖరుడు అని పిలుస్తారు.
చంద్రునికి ప్రత్యేకించి ఆలయం లేనందున శివుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది.
అంతేకాదు. సోమ అనే శబ్దాన్ని స+ఉమ అని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది.
ఉమాసహితుడైనవాడు అంటే పార్వతీపతి ఎవరు? శివుడే కదా..! ఆ విధంగా సోమవారం శివునికి
ప్రత్యేక దినంగా రూపాంతరం చెందింది.
స్కాందపురాణంలో సోమవార వ్రతమహిమ ఉంది. ఈ రోజున శివుడు ఉమాసహితుడై భక్తులను అనుగ్రహిస్తాడు.
సోముడంటే కుబేరుడు అనే అర్థం కూడా ఉంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్.. ఈశ్వరుడు ఐశ్వర్యదాయకుడు. శివుని ఆరాధించిన కుబేరుడు ఐశ్వర్యవంతుడైన రోజు కనుక ఈ రోజును సోమవారం అని పిలుస్తున్నారని పెద్దలు చెబుతారు.
స్కాందపురాణం సోమవారవ్రతం వైశిష్ట్యాన్ని చెబుతూ అందుకు ఉదాహరణగా చంద్రాంగదుని కథ చెప్పింది.
నలదమయంతుల మనుమడు చంద్రాంగదుడు , అతడు చిత్రకర్మ కుమారై సీమంతినిని వివాహమాడి కొంతకాలం మావగారింట్లోసుఖంగా గడిపాడు. ఓరోజు యమునా నదిలో మిత్రులతో నౌకావిహారం చేస్తూ పెద్దగాలికి నౌక తిరగబడగా నీటిపాలయ్యాడు.అప్పుడు మైత్రేయి అనే మునిపత్ని సీమంతినికి దైర్యంచెప్పి పరమశివునికి ఇష్టమైన సోమవారవ్రతం చేయమని ప్రోత్సహించింది. అమె వ్రతం ఆరంభించింది. నౌకాప్రమాదంలో నీళ్ళలో పడిన చంద్రాంగదుడు అట్టడుగున ఉండే నాగలోకం చేరాడు. అక్కడ నాగరాజైన తక్షకుడు చంద్రాంగదుని వినయవిధేయతలకు మెచ్చి, కానుకల్చి, నాగకన్యలతో పాటు ఒక నాగ యువకుని తోడిచ్చి సాగనంపాడు అప్పటికి భూలోకంలో మూడేళ్ళు గడిచిపోయాయి. అతని రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. భార్య వ్రతదీక్షలో ఉంది. పరిస్థితిని గమనించిన చంద్రాంగదుడు శత్రువులను జయించి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. పరమశివునికి ప్రీతికరమైన సోమవార వ్రతాన్ని కార్తీక సోమవారాలలో చేస్తే సత్ఫలితాన్నిస్తుంది...🚩
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి