1, జులై 2021, గురువారం

పురాకృతం..* *(రెండవ భాగం.)*

 *పురాకృతం..*  *(రెండవ భాగం.)*


*కర్మ క్షయము ఎలా అవుతుంది అనే చర్చచేసే ముందు  ఇంతవరకు చెప్పుకున్నది సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందుకోసం సంచితం, ఆరబ్దము, అనారబ్దము, ఆగామి, పదాలు సరిగ్గా అర్థం అయ్యుండాలి.*


 అవి సరిగ్గా అర్థం కావడానికి ఒక ఉదాహరణ  చెప్తాను.


ఒకానొక కుటుంబంలో తాత  బాగా డబ్బు కూడబెట్టి అదంతా బంగారము రత్నాలు మొదలైనవి గా మార్చి ఇంటి వెనక పాతి పెట్టాడు. వాళ్ల కొడుకులు  ఆ నిధి లోంచి కొద్దిగా బంగారమూ రత్నాలూ బయటకు తీసి అవి అమ్మి ఆ డబ్బులో కొంత భాగం కుటుంబ అవసరాల కోసం సరుకులు మొదలైనవి కొని పెట్టుకున్నారు. మిగిలిన డబ్బు వడ్డీకి ఇవ్వడం షేర్లు కొనడం ఆస్తులు కొనడం మొదలైన విధాలుగా పెట్టుబడులు పెట్టుకున్నారు.


ఈ కథలో తాత పాతి పెట్టిన నిధి సంచితము.  కుటుంబ అవసరాల కోసం వీళ్లు సరుకులు కొనుక్కుని పెట్టింది వీళ్ళు తమ ఆదాయం లో నుంచి తమ జీవిత కాలంలో ఖర్చు చేసుకున్నది ప్రారబ్దము. నిధి లో ఉన్న మిగిలిన సంపద వీళ్లకు సంబంధించినంత వరకూ అనారబ్దము. అప్పుల మీద వచ్చే వడ్డీ లోనుంచి, షేర్ల మీద వచ్చే ఆదాయము లోనుంచి, వచ్చిన అద్దెల లోనుంచి, వీళ్ల ఖర్చులు పోను, వీళ్ళు మిగిలించి పిల్లలకు అంటే మనవళ్లకు ఇచ్చేది ఆగామి. 


వీళ్ళ పిల్లల దగ్గరికి (మనవళ్లకు) వచ్చేటప్పటికి నిధిలో మిగిలినదీ, తమ తండ్రులు సంపాయించి ఖర్చు పెట్టకుండా తమకు ఒప్ప చెప్పినదీ, రెండూ కలిసి మళ్లీ సంచితము అవుతుంది.


తాత పూర్వజన్మ అనుకోండి వీళ్లు ఇప్పటి జన్మ. వీళ్ళ పిల్లలు తర్వాత జన్మ. ఇలా అనుకుంటే పైన చెప్పిన ఉదాహరణ సులభంగా అర్థమవుతుంది.


*హిందూ మతం చెప్పేది ఏమిటంటే సంచితాన్ని, ఆగామిని రెండిటినీ నాశనం చేసుకోవచ్చు. కానీ ప్రారబ్దము నుంచి  తప్పించుకోవడానికి వీలుపడదు. కర్మ భక్తి జ్ఞాన మార్గాలు మూడూ ఇదే చెప్తాయి. తేడా లేదు.*


 కర్మక్షయం ఎలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాము.


*పవని నాగ ప్రదీప్.*


తరువాయి భాగం..రేపు...

కామెంట్‌లు లేవు: