1, జులై 2021, గురువారం

సమస్త వేద వాఙ్మయం

 సమస్త వేద వాఙ్మయం మనిషి, జీవ ఆవిర్భావ మును తెలుపు చున్నది. నమకం, చమకం దశ,శాంతులు మంత్ర పుష్పం, పురుష సూక్తంతో సమస్త వేద ఉపనిషత్ సారము శక్తితో గల పదార్ధ నిరూపణకు సూత్ర పరంగా వివరించినది. అవి సూత్రములే తప్ప మరేమియు కాదు. సమస్త ప్రకృతి శక్తి లక్షణ సారమే జీవుడు దేహము. తేడాలు ఎందుకంటే రూప, లింగ, వర్ణ, కాల, ప్రకృతి, యే వివిధ రూపములుగా కనబడుట. జీవులు కూడా విభిన్నమైన మనస్తత్వములు కలిగియుండుట. చ మే మన శరీరముతో కలిగియున్న పదార్ధ రూప శక్తియే శివ తత్తవం. జీవ తత్వం. రోజూ లింగారాక్షన సాలగ్రామ రూపములో సాధనా తత్వము, దేహమును ఆశ్రయించియున్న గుణములను తెలియుటకై. పదార్ధము మార్పు చెందుతున్నది, దానియందు శక్తి యున్నట్లు, మన దేహము కూడా. అట్టి దేహమును కాపాడుటకు నియమిత మార్గంలో దేహమును బుధ్జిని ప్రగృతికి అనుగుణంగా స్థిరమైన భావముతో ప్రవర్తింప చేయుటయే. శంచమే మన దేహము ఈశతత్వమును పూర్ణముగా తెలుపు చున్నది. అది మనస్సు రూపమున సోమాయచ,చంద్ర లక్షణముగా మారి తెలుపుచున్నది. మనస్సు వకరూపంలేదు. అది శక్తియే. బుధ్దికి కూడా రూపం లేదు. కాని దాని మూలతత్వమైన చంద్రునికి, సూర్యునికి గోళాకృతితోగల  చైతన్యం కలదని దానివలన శక్తికి మార్పు చెందుతున్న లక్షణము. యిది ప్రకృతికి ఆధారభూతమై యున్నదని మనం భావించు చున్నాము. మనం మనకి స్నానము చేయుట వలన బాహ్య, అంతర శుచి ఏలాగునో అదే సూత్రము లింగమునకు అభిషేక రూపము వలన ప్రకృతిని సమ తుల్యత చేయుటకే. దీనికి కాలానుగుణంగా 12 నెలలకు 12 ఆదిత్యులు మాఘ మాసమునకు సూర్యుని పేరు. అర్కయని పేరు. అర్క శక్తిని జిల్లేడు ద్వారా దీనికి రేగుపండును చేర్చిన అర్క శక్తిని భౌతికంగా తెలియవచ్చును. రేగుపండును అనంత శక్తి ఆశ్రయించి యున్నది. దీనిలో యున్న శక్తి 6 రోజుల ఆహార శక్తితో అదియును మాఘ మాసములో మాత్రమే.తపస్సుకు సమతుల్యత ఆహారమునకు రేగు పండు స్వీకరించుట కలదు. వివిధ రూపములలో ఆహారం దొరకని సమయంలో రేగు పండును ఆహారమునకు సమానంగా ఔషధ పరంగా కూడా సమానం. మనలో క్షద్భాదనుధైనికి కారణమైన ఉష్ణ మును రేగు పండు సమతుల్యతను చేయుట. ఉపవాస దీక్షకు యిదికూడా వక ఆహార ప్రత్యామ్నాయం. యిక మాఘమాసంలో శతభిషంతో రాహువుతో మాసం ప్రారంభమై మఘతో కేతువుతో పూర్ణముగా లక్షణము పౌర్ణమి తో భూమి శక్తిని గ్రహించును.దీనివలన భూమిపై అంతవరకూ యున్న శీతలస్థితి నుండి ఉష్ణ శక్తిని ప్రకృతి గ్రహించి మానవ జీవనమునకు సూత్రపరమైన సంబంధం. దీని రంగు లక్షణము 🔴. సప్తమికి అర్ధ భాగంలోగల కాంతిని కృత్తిక నాటికి రధసప్తమి నాటికి జీవచైతన్యకారణమై యుండి పౌర్ణమికి పూర్తి శక్తి లభించును.మాఘ పౌర్ణమి శక్తి వలన అనంతమైన శక్తిని భూమి గ్రహించుట, యిది జీవ వ్యాప్తికి కారణమగును. అందుకే చిన్న పిల్లలుకు రేగు పళ్ళుతో భోగి పండుగనాడు సమస్త జనులకు జిల్లేడుతో కూడిన రేగు పళ్ళ స్నానం రధ సప్తమికి జీవ చైతన్యశక్తికి మూలకారణం.మాఘమాసంలో ఏ ఆరాధనలోనైనా ఎరుపు వర్ణ పుష్పములుతో  అనగా అర్చన చేయుటయే జీవునికి చైతన్య లక్షణము. యిలా అన్ని నెలలో ప్రతీ శక్తిని రూపములలో మానవ జీవనమునకు 12 నెలలు ప్రకృతి రూపంగా  వక్కొక్క నెలలో వక్కొక్క రూప నామ,లింగ, వర్ణ, రస,రంగులు కలిగి అర్చన చేయుట. అట్టి పదార్ధములను ఎక్కువగా స్వీకరించుట. వక్కొక్క నెలలో వక్కొక్క పేరుతో అభిషేక ప్రక్రియ.జిళ్ళేడు పూవులు కూడా అర్చన శివునికి.దీనిలో యు వి రేస్ అతినీలలోహిత శక్తి అధికంగా కలిగియుండుటవలన దానిని నీటితో శుద్ది చేసి అర్చించుటవలన దాని శక్తి మనకు కూడా. దీని వివరణ పూర్తి శక్తిని ప్రకృతి నుండి మాత్రమే స్వీకరించుటయనే జీవ లక్షణమునకు సంబంధించినది.ప్రకృతిలో అంతవరకూ యున్న వాత శక్తిని హరించి ఉష్ణ శక్తిని స్వీకరించుటయనే ప్రక్రియ. అనంతమైన ఙ్ఞానమును తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం. 

.

కామెంట్‌లు లేవు: