వైద్యోనారాయణోహరిః
ఆ బ్రహ్మ దేవుని సృష్టి
మానవ జన్మ అంటారు
స్వర్గంలో ఉన్న బ్రహ్మకు
ఓ ప్రతినిధే మన వైద్యుడు
మన శరీరం ఓ అద్భుత సృష్టి
అది మమతాను బంధాలతో
కుటుంబ వ్యవస్థలో అల్లుకున్న
ఓ పెద్ద తీగ
భార్యా భర్తలు పిల్లాపాపలనే కొమ్మలు
ఆ మొదలు నుండి విస్తరించి
ఓ ఆకురాలినా, ఆ ఇంటిల్లిపాదీ
కన్నీటి పర్యంతం
అయితే తన నైపుణ్యంతో
ఈ కన్నీటిని ఆనంద బాష్పాలుగా
మార్చగలిగే ఒకే ఒక్కడు వైద్యుడు
అయితే జీవన పోరాటంలో
ఎన్నో పరాన్నజీవులు
మన శరీరంలో ప్రవేశిస్తూ
ఇప్పుడు మనంచూసే
కరోనా లాంటి
అతి సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిమి
అనతికాలంలో మనల్ని
భయంకరమైన జబ్బులకు గురిచేస్తే
ఆదుకునే ఒకే ఒక దేవుడు వైద్యుడు
బ్రహ్మదేవుని ప్రతినిధిగా
ఆసుపత్రి అనే కోవెలలో
వెలసిన నడిచే దేవుళ్ళే వైద్యులు
అవసరమైతే గుండె తీసి
మరో గుండే అమర్చగలడు
రక్తనాళాలలో పేరుకుపోయిన
మలినాలు క్లీన్ చేసే ఓ స్కావింజర్
అవతారమెత్తగలడు
ప్రమాదాల్లో ఇరిగిన ఎముకల్ని
నేర్పుగా అతికించి చక్కబెట్టే కార్పెంటర్ గా
కిడ్నీలలో రాళ్ళను బ్లాష్టింగ్ చేసి
తొలగించే ఓ మైనింగ్ ఇంజనీర్ డాక్టర్
కిడ్నీలే మార్పు చేయగల గడసరి డాక్టర్
ముక్కుసొట్టలు మూతిసొట్టలు సరిజేసె చక్కని శిల్పి డాక్టర్
పళ్ళూడి నమలండం చేతగాని
వృద్ధులకు ఏకంగా పళ్ళు అమర్చి పుణ్యం కట్టుకునే పుణ్యాత్ముడు డాక్టర్
ఒక్కమాటలో చెప్పాలంటే శరీరం అనే ఈ యంత్రాన్ని రిపేర్ చేయగల ఓ మెకానిక్
మనందరి పరలోక పయనం
వాయిదా వేయించగల నేర్పరి
అందుకే యమధర్మరాజుకు
మన వైద్యుడంటే కోపం
ఓ సారి ఓ వైద్యుని పై యమలోకంలో
విచారణ జరుగుతోంది
వచ్చిన ఆరోపణ చిత్రగుప్తుడు చదువుతూ
ప్రభూ ఈయన భూలోకాన ఓ వైద్యుడు
యమలోకానికి రావలసిన మానవులను
తన వైద్యంచే అక్కడ నిలిపివేసి
యమధర్మానికి అడ్డుకట్ట వేశారు
అన్న ఆరోపణ లేవదీశాడు
ఇంతలో యమధర్మరాజుకు గుండె పోటు వచ్చి గిల గిల లాడుతున్నాడు
వైద్యుడు వెంటనే యమధర్మరాజుకు
వైద్యచేసి నయంచేశాడు
ఆ వెంటనే యమధర్మరాజు
ఇకనుండి వైద్యులెవరొచ్చినా
నేరుగా స్వర్గలోకానికి పంపమని
యమలోక చట్టాలకు సవరణలు తెచ్చారు
ఈరోజు మానవజాతి ప్రాణదాతలకు
జాతీయ డాక్టర్లదినోత్సవాన
పలుకుదాం జేజేలు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి