20, మార్చి 2025, గురువారం

గరుడ పురాణం_*22వ

 *గరుడ పురాణం_*22వ భాగం*


_*మహాశక్తులను బీజమంత్ర యుక్తంగా ఆయా దిశల్లో ఇలా జపించాలి.*_


ఓం రాం పద్మాయై నమః - ఆగ్నేయం


ఓం రీం దీప్తాయై నమః - నైరృత్యం


ఓం రూం సూక్ష్మాయై నమః - వాయవ్యం


ఓం రేం జయాయై నమః - ఈశాన్యం


ఓం రైం భద్రాయై నమః - తూర్పు


ఓం రోం విభూత్యై నమః - దక్షిణం


ఓం రౌం విమలాయై నమః - పశ్చిమం


ఓం రం అమోఘికాయై నమః - ఉత్తరం


ఓం రం విద్యుతాయై నమః - ఉత్తరం


ఓం రం సర్వతోముఖ్యై నమః - మండలమధ్యం


_*తరువాత శివస్వరూపమున్న సూర్య ప్రతిమను సూర్యాసనంపై స్థాపించి "హ్రాం హ్రూం (లేదా హ్రీం)సః" అనే మంత్రంతో ఆ దేవుని అర్చించి క్రింది మంత్రాలతో న్యాసం చేయాలి.*_


'ఓం ఆం హృదర్కాయ నమః '


'ఓం భూర్భువః స్వః శిరసే స్వాహా'


'ఓం భూర్భువః స్వః శిఖాయై వౌషట్'


'ఓం హ్రం జ్వాలిన్యై నమః '


'ఓం హ్రుం కవచాయ హుం'


'ఓం హ్రూం అస్త్రాయ ఫట్'


'ఓం హ్రం ఫట్ రాజ్యై నమః '


'ఓం హ్రం ఫట్ దీక్షితాయై నమః '


_*అంగన్యాసానంతరము సాధకుడు ఈ దిగువ నీయబడిన మంత్రాలతో సూర్యాది నవగ్రహాలకు ‘మానసీపూజ'ను సంపన్నం గావించాలి.*_


ఓం సః సూర్యాయ నమః 

ఓం సోం సోమాయ నమః 

ఓం మం మంగలాయ నమః 

ఓం బుం బుధాయ నమః 

ఓం బృం బృహస్పతయే నమః, 

ఓం భం భార్గవాయ నమః, 

ఓం శం శనైశ్చరాయ నమః, 

ఓం రం రాహవే నమః, 

ఓం కం కేతవే నమః, 

ఓం తేజశ్చండాయ నమః ।


_*ఈ విధంగా సూర్య దేవాదులను పూజించి ఆచమనం చేసి ఆపై ఈ క్రింది మంత్రా లతో చిటికెన వ్రేలితో మొదలెట్టి అన్ని వేళ్ళతో కరన్యాస, అంగన్యాసాలను చేయాలి.*_


ఓం హం హృదయాయ నమః, 

ఓం హీం శిరసే స్వాహా, 

ఓం హూం శిఖాయై వౌషట్, 

ఓం హైం కవచాయ హుం, 

ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్, 

ఓం హః అస్త్రాయ ఫట్


_*తరువాత భూతశుద్ధి గావించి మరల న్యాసం చేయాలి. అర్ఘ్యస్థాపన చేసి ఆ జలాన్ని తన శరీరంపై జల్లుకోవాలి. తరువాత శివునితో పాటు నందీశ్వరాదులను పూజించాలి. 'ఓం హౌం శివాయ నమః' అనే మంత్రంతో పద్మస్థితుడైన పరమశివుని పూజించిన పిమ్మట నంది, మహాకాల, గంగ, యమున, సరస్వతి, శ్రీవత్స, వాస్తుదేవత, బ్రహ్మ, గణపతిలనూ తదుపరి తన గురుదేవునీ సాధకుడు అర్చించాలి.*_


_తరువాత పద్మమధ్యంలో నున్న శక్తి అనంతదేవులనూ, పద్మ పూర్వ దళంలో ధర్మాన్నీ, దక్షిణంలో జ్ఞానాన్నీ, పశ్చిమంలో వైరాగ్యాన్నీ, ఉత్తరంలో ఐశ్వర్యాన్నీ, ఆగ్నేయంలో అధర్మాన్నీ, నైరృత్యంలో అజ్ఞానాన్నీ, వాయవ్యంలో అవైరాగ్యాన్నీ, ఈశాన్యంలో అనైశ్వర్యాన్నీ పద్మకర్ణికపై వామా, జ్యేష్ఠాశక్తులనూ మరల తూర్పుతో మొదలుపెట్టి రౌద్రీ, కాలీ, శివా, అసితాది శక్తులనూ పూజించాలి._


_*తరువాత శివుని కెదురుగా నున్న పీఠంపై ప్రతిష్టింపబడిన కలవికరిణీ, బలవికరిణీ, బలప్రమథినీ, సర్వభూతదమనీ, మనోన్మనీ అనే మహాశక్తులను ఈ దిగువ నీయబడిన మంత్రాలతో పూజించాలి.*_


ఓం హౌం కలవికరిణ్యై నమః, ఓం హౌం, బలవికరిణ్యై నమః, 

ఓం హౌం బల ప్రమథిన్యై నమః, 

ఓం సర్వభూత దమన్యై నమః, 

ఓం మనోన్మన్యై నమః ।


_*తరువాత సాధకుడు ఒక ఆసనం పైకి శివునాహ్వానించి ఆయన మహామూర్తిని స్థాపించాలి. అప్పుడు శివునుద్దేశించి ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధ, సకలీకరణాది ముద్రలను చూపించి అర్ఘ్య, పాద్య, ఆచమన, అభ్యంగ, ఉద్వర్తన, స్నానీయ జలాలను సమర్పించాలి. పిమ్మట అరణి- మంథనం చేసి ఆ మహాదేవునికి వస్త్ర, గంధ, పుష్ప, దీప, "చరు" నైవేద్యాలను సమర్పించాలి.*_

_('చరు' అనగా హోమయోగ్యమైన, పక్వం చేయబడిన అన్నము.)_


_*నైవేద్యానంతరము ఆచమనం చేసి ముఖశుద్ధికై (ముఖమనగా నోరు) తాంబూలము, కరోద్వర్తనం, ఛత్రం, చామరం యజ్ఞోపవీతం, ప్రదానం చేసి "పరమీకరణ" చేయాలి.*_

_("పరమీకరణ"మనగా అర్చనీయదేవునిలో సర్వోత్కృష్టత యను భావము గట్టి పఱచుట.)_


_*పిమ్మట సాధకుడు ఆరాధ్య దైవం ఆకారాన్ని ధరించి ఆయనను జపించి వినమ్రతతో స్తుతించాలి. హృదయాదిన్యాసాలను చేసి సంపూర్ణం గావించు ఈ పూజనే 'షడంగ పూజ' అని వ్యవహరిస్తారు.*_


_తరువాత దిక్పాలకులనూ, వారి మధ్యలో చండేశ్వరీ దేవిని పూజించాలి._


_*చివర మరల శివుని ఇలా స్తుతించాలి. క్షమాయాచన చేసి కంకణాన్ని విసర్జించాలి.*_


_*గుహ్యాతిగుహ్యగోప్తాత్వం గృహాణా స్మత్కృతం జపం |*_

_*సిద్ధిర్భవతు మేదేవ త్వత్ప్రసాదాత్ త్వయి స్థితిః ||*_


_*యత్కించిత్ క్రియతే కర్మ సదా సుకృత దుష్కృతం !*_

_*తన్మే శివ పదస్థస్య రుద్ర క్షపయ శంకరః ॥*_


_*శివోదాతా శివోభోక్తా శివః సర్వమిదంజగత్ |*_ 

_*శివోజయతి సర్వత్రయః శివః సో హమేవచ ll*_


_*యత్కృతం యత్ కరిష్యామి తత్సర్వం సుకృతం తవ |*_ 

_*త్వం త్రాతా విశ్వనేతాచనాన్యో నాథో..స్తి మే శివ ॥*_


_'హే ప్రభో! నీవు గుహ్యాతిగుహ్యమైన తత్త్వాలకు సంరక్షకుడవు. నేను చేసిన జపాన్ని స్వీకరించు. నాకు సిద్ధిని ప్రాప్తింపజేయి. నీ కృప వల్ల నాకు నీ పట్ల గల ఈ నిష్ఠ శాశ్వతంగా వుండేలా వరమియ్యి. రుద్రదేవా! శంకరా! నా పాపాలను నశింపజెయ్యి. పుణ్యాన్ని కూడా హరింపజేసి నన్ను నీ పాదాల చెంత పడవేసుకో. భక్తులకు సర్వస్వాన్నీ వరంగా ఇచ్చే నీవే సర్వవ్యాపకుడవు. సర్వభర్తవు. నా భవిష్యత్కర్మలన్నీ నీ వైపే పయనించే లాగ నన్ను దీవించు. రక్షకుడవు నీవే. విశ్వనాయకుడవు నీవే.


హే పరమశివా! నాకు వేరే దిక్కు గాని దైవంగాని లేదు' అని ఈ స్తుతి సారము._


_*ఈ రకంగా శివోపాసనచేయగలిగిన సాధకుడు అకాల మృత్యువాతపడడు. అతి శోతోష్టాలకూ అతీతుడవుతాడు.*_

కామెంట్‌లు లేవు: