3250. *మాయను జయించడం చాలా కష్టం. ఏ విభూతి వల్ల మాయ మనల్ని అంటకుండా ఉంటుంది?* *శివమహాపురాణం*
◆ శివ నిర్మాల్యం, శివుడికి సమర్పించిన బిల్వ పత్రములు (మారేడు ఆకులు), లేదా అర్జున పత్రాలు (మద్ది చెట్టు ఆకులు), ఇంకేవైనా పత్రాలు, పుష్పాలు నందీశ్వరుని శరీరానికి తగిలించి ఇంటికి తీసుకెళ్లండి, బాగా ఎండబెట్టండి. ఎక్కడైనా హోమం జరిగితే అందులో వేసి పూర్ణాహుతి అయ్యాక హోమగుండం నుండి భస్మమును తీసుకోండి. ఒకవేళ అలా భస్మం తీసుకునే అవకాశం లేనపుడు, *ఇంట్లోనే నిర్మాల్యం మీద కాస్త ఆవు నెయ్యి వేసి కాల్చగా వచ్చిన భస్మమును 40 రోజులు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ధరిస్తే పొరపాటున కూడా మాయ అంటదని పురాణములో పుష్పదంతుడి కథ ద్వారా తెలుస్తుంది, అలానే జగద్గురువులు శంకరులు, మరియు నడిచే దైవం కంచి పరమాచార్యులు చెప్పారు.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి