కోరికలు లేని మానవుడు ఉండడు అంటే ఆశ్చర్యం ఏమి లేదు. కాకపొతే ఒక్కొక్కరి కోరిక ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందమంది కోరికలు చిన్నగా ఉంటే మరికొంతమంది కోరికలు పెద్దగా ఉంటాయి. కోరికలు లేని వారు అస్సలు వుండరు అన్నది ముమ్మాటికీ నిజం. అప్పుడే పుట్టిన పిల్లవానికి కోరికలు వుండవు అని మనం అనుకోవటానికి వీలు లేదు. కాకపొతే వాడికి మాట్లాడటం రాదు కాబట్టి వాడి కోరికలను మనం గుర్తించలేము. బహుశా వాడి కోరికలు ఇలా ఉండవచ్చు. నేను ఏడవకుండా మా అమ్మ నాకు పాలు ఇవ్వాలి. అలానే నేను పక్క తడిపితే కూడా ఏడవకుండా మా అమ్మ పక్క మార్చాలి. ఇంకా కొంచం పెద్ద అయిన తరువాత ఎప్పుడు మా అమ్మ నన్ను ఎత్తుకొని ఉండాలి ఇలా మనం అనుకోవచ్చు. కొంచం పెద్ద పెరిగితే కోరికలు కూడా పెద్దవి అవుతాయి. నాకు ఆడుకోవటానికి బొమ్మలు కావాలి నేను ఇష్టంగా తినే పండ్లు నాకు కావలి ఇలా ఉండవచ్చు. మాటలు వచ్చి విద్యాబ్యాసం మొదలు పెట్టినప్పుడు ఇక కస్టాలు మొదలవు తాయి. ఇన్ని రోజుల స్వేచ్ఛ కాస్తా హరిస్తుంది. ముందుగా తోటి పిల్లలతోటి స్పర్ధలు. వాడు నా పెన్సిలు తీసుకున్నాడు, వీడు నా నోటుబుక్కు తీసుకున్నాడు. నా టిఫిన్ బాక్సులో అమ్మ నాకు ఇష్టమైనది పెట్టలేదు ఇలా సమస్యలు పెరిగితే అవి లేకుండా ఉండాలనే కోరికలు కూడా పెరుగుతాయి.
మనిషి వయస్సు పెరిగే కొద్దీ కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. చిన్నతనంలో తన తోటివారికన్నా తనకు ఎక్కువ మార్కులు రావాలని, వాళ్లకన్నా మంచి బట్టలు కావాలని, ఇంకా ఎన్నో వస్తువులు కావాలని ఇట్లా అనేక కోరికలు పుడుతూ ఉంటాయి.
యుక్త వయస్సు రాగానే స్త్రీ పురూరుష ఆకర్షణకు లోనై తదనుగుణంగా కోరికలు కలుగుతూ ఉంటాయి.
చదువు అయిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మంచి ఉద్యోగం రావాలని ఎక్కువ జీతం రావాలని కోరికలు ఉంటాయి. ఉద్యోగం వచ్చి స్థిరపడిన తరువాత మంచి భార్య రావాలని కోరిక ఉంటుంది.పెళ్లి అయినతరువాత జీవితం సుఖమైయంగా ఉంటుందని సగటు మానవుడు అనుకుంటాడు. నిజానికి అసలు కధ అప్పుడే మొదలైతుండు. తన సంపాదన తన శ్రీమతి విలాసాలకు సరిపోక అనేక ఇక్కట్లు పడటం కొంతమందికి అనుకూలవతి అయిన స్త్రీ లభిస్తే పెండ్లి అయినా వెనువెంటనే సంతానం కలగటం ఆ సంతానాన్ని సరిగా పెంచటానికి ఖర్చులు పెరగటం వాళ్ళ అనారోగ్య సమస్యలు ఇలా సమస్యలు పెరిగితే ఆ సమస్యలు నివారణ అవ్వాలనే కోరిక కలగటం సామాన్యం. ఇక వాళ్ళు పెరిగి పెద్దవాళ్లయితే వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, వివాహాలు ఒకటేమిటి ప్రతి క్షణం ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యలు తీరాలనే కోరికలు ఎలాగో ఉంటాయి. ఇంతలో తానూ ముదుసలి కావటం శరీరం డస్సి పోవటం తన ఆరోగ్యం తన శ్రీమతి ఆరోగ్యం వెరసి ప్రతి దినం ఒక క్రొత్త సమస్య ఆ సమస్య తీరాలనే కోరికలు.
ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి మనిషి అనుక్షణం సమస్యలు, కోరికలు రెండు జంట గుర్రాలులాగా కనపడతాయి. నిజానికి మనం ఆలోచిస్తే కోరికలు లేని మనిషి ఈ ప్రపంచంలో లేనే లేడు అంటే అతిశయోక్తి లేదు. భగవంతుడిని ఎక్కువ భక్తితో ఆరాధించే వారు ఎవరంటే వారు కేవలం తమ కోరికలు తీర్చమనె వారే అని అనవచ్చు. మనకు తెలుసు తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనానికి రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూ వుంటున్నారని. దానికి కారణం ప్రతి మనిషి ఏదో ఒక కోరికతో స్వామిని దర్శించు కొని మొక్కులు మొక్కుకొని ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు.
జీవితం అంటేనే కోరికల పుట్ట కోరికలు ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి మనిషి మెదడును తొలుస్తూ ఉంటాయి. కిరాయి ఇంట్లో వున్న వాడికి సొంత ఇల్లు కోరిక సొంత ఇల్లు ఉన్నవాడికి ఇంకా పెద్ద ఇల్లు కావాలనే కోరిక ఒక కోరిక తీరితే వెనువెంటనే ఇంకొక కోరిక పుడుతూనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కోరికలకు అంతం అనేది లేనే లేదు అని చెప్పవచ్చు. మనిషి ఊపిరి పోసుకున్నప్పడినుంచి ఊపిరి ఆగే వరకు కోరికలే కోరికలు.
ముందుగా
ప్రతి మనిషి తన కోరికలు తీర్చమని భగవంతుని ప్రార్ధించడం అలవాటు
చేసుకోవాలి. ఆలా భగవంతుని భక్తి తో మనస్సును ఊరట చెందింస్తే తరువాత తన
కోరికలు నొకటొకటిగా తీరుతుంటే దైవ భక్తి పెరుగుతుంది. అంతే కాదు తదనుగుణంగా
తెలియకుండానే ధర్మ ప్రవర్తన పెరుగుతుంది అంటే సాటివానికి సాయపడే తత్వము
జీవుల పట్ల కారుణ్యము పెరిగి ఒక దశలో దైవ భక్తి మానసిక ప్రశాంతతను కలుగ
చేస్తుంది. అప్పటినుంచి మనిషి భక్తుడుగా మారుతాడు. నిచయం దైవచింతనతో కాలం
గడుపుతూ ఒక మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందుతాడు. ఎప్పుడైతే
దైవచింతన మీద మనస్సు లగ్నాత చెందుతుందో అప్పుడు చక్కని సాధకుడుగా
మార్తాడు.
నిజమైన సాధకుడు ఈ సత్యాన్ని తెలుసుకొని తన రోజులో కొంత భాగం భగవంతుని కొరకు కేటాయిస్తాడు ఆలా నిత్యం సాధన చేస్తూ చేస్తూ సాధనలో పట్టు సాధించి చివరకు ఒక సద్గురువు ఆశీర్వాదంతో ముక్తిని పొందుతాడు.
ఓం శాంతి శాంతి శాంతిః
ఇట్లు
మీ
చేరువేల భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి