2, జులై 2023, ఆదివారం

పుట్టుకలేనివాడు

 శుభోదయం🙏


పుట్టుకలేనివాడు!

ఉ.

పుట్టువు లేని నీ కభవ పుట్టుట క్రీడయగాక పుట్టుటే?

యెట్టనుడున్ భవాది దశలెల్లను జీవులయందవిద్య దాఁ/

 జుట్టుచు నుండుఁ గాని నినుఁ జుట్టినదింబలెఁ బొంత నుండియుం/

జుట్టఁగలేమిఁ దత్క్రియలఁ జొక్కనియెక్కటి వౌదు వీశ్వరా!


రచన:-పోతనమహాకవి.

భాగవతం-10స్కం-90పద్యం.


పుట్టుట ఎరుగని నారాయణా! నీకు పుట్టుక అంటు వేరే లేదు. అటువంటినీవు ఇలా పుట్టడం నీకు క్రీడ లాంటిదిఅది ఎలా అంటే జన్మ , మరణం మొ/నవన్నీ మాయ కారణంగా జీవులను ఆవరిస్తు వుంటాయి. కాని నిన్ను మాత్రం ఆమాయ స్ప్రుశించలేక దూరంగా వుండిపోతుందీ కనుక ఆమాయామయమైన క్రియలు వేటిలోను చిక్కు కొనకుండా ఏకైక మూర్తిగా నిలబడి పోతావు.కనుకనే ఈజగత్తులకన్నిటికీ నీవు ఈశ్వరుడవు.

           నమో నారాయణాయ!

                        స్వస్తి!

కామెంట్‌లు లేవు: