2, జులై 2023, ఆదివారం

సంతోషం పొందే మార్గాలు

 హరిఓం  , 


*ఓ మానసిక శాస్తవ్రేత్తని స్థితిమంతురాలు అయిన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని, తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది! ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది!*

సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది!


*వెంటనే అతను తన ఆఫీసుని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్త్రీ ని పిలిచాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి.*

*అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకు చెబుతాడు!*


*తన చేతిలో చీపురు ఓ మూలన పడేసి ఆ స్త్రీ , యువతి ముందు ఉన్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పింది!*

*"నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు! ఆ తర్వాత మూడు నెలలకి నా ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాకు ఏమీ మిగల్లేదు. నిద్రపోలేకపోయాను! అంతా దుఃఖం!! ఏమీ తినలేకపోయాను! ఆత్మహత్య చేసుకోవాలనిపించేది! ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతోనైనా వారిని పలకరించలేదు!*


*ఇలాంటి పరిస్థితుల్లో వున్నప్పుడు ఓరోజు మా ఇంటి ముందు చిన్న కుక్కపిల్లను గమనించాను. చాలా చలిగా ఉంది. ఆ కుక్కపిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడిపాలని ఓ గిన్నెలో పోసి దాని ముందుపెట్టాను. అది ఆ పాలను తాగింది. ఆ గిన్నెను కూడా నాకేసింది. ఆ తరువాత నా దగ్గరికి వచ్చింది. నా కాళ్లని చాలా ప్రేమతో నాకింది. తన ఒంటి మీద వున్న బూరుతో రుద్దింది.*

*అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది! కొన్ని నెలల తరువాత నేను నవ్విన చిరునవ్వు అది!!*


*నేను ఆలోచనల్లో పడ్డాను. ఓ చిన్న సహాయం ఆ కుక్కపిల్లకి చేయడంవల్ల నాకు సంతోషం కలిగిందే, మరి ఇంకాస్త సహాయం తోటి వాళ్లకి చేస్తే ఇంకా కాస్త సంతోషం కలుగుతుంది కదా అని అన్పించింది.*


*ఆ తెల్లవారి మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను. ఆరోజునుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో సహాయం చేస్తూ వచ్చాను.* *వాళ్లు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసేది. ఈ రోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని అన్పిస్తుంది. ఆనందంగా తింటున్నాను.* *ఇంకా ఆనందంగా నిద్రపోతున్నాను. ఎదుటి వాళ్లకి ఇవ్వడంలో నాకు ఆనందం కన్పిస్తుంది!*

*డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు! కాని సంతోషాన్ని కొనుక్కోలేరు!*

*అది మనకి మనం పొందాల్సి ఉంటుంది. ఆ అందమైన యువతికి సంతోషం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో బోధపడింది!*

*నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్న దాన్ని బట్టి జీవితంలో అందం వుంటుంది!*

*నీవల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇంకా ముఖ్యమైంది!*

*సంతోషం అనేది గమ్యం కాదు! అది ఒక ప్రయాణం! సంతోషం మరో రోజులో లేదు.ఇప్పుడే ఉంది!*


        🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏


కెర్లెపల్లి బాలసుబ్రమణ్యం 


కామెంట్‌లు లేవు: