2, జులై 2023, ఆదివారం

ఈ రోజు పదమ

 208వ రోజు: (భాను వారము) 02-07-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదమ:

దత్త పుత్రుడు: కులటుడు, దత్తకుడు, దత్త్రియుడు, పోష్యపుత్రుడు, పోషయసుతుడు 


 ఈ రోజు పద్యము:


 సన్నుత కార్యదక్షు డొకచాయ నిజప్రభ యప్రకాశమై/

యున్నపుడైన లోకులకు నొండక మేలొనరించు సత్వసం/

పన్నుడు భీము డా ద్విజులప్రాణము కావెడి ఏకచక్రమం/

దెన్నికగా బకాసురుని నేపున రూపడగించి భాస్కరా!


ఓ భాస్కరా! భీముడు బ్రాహ్మణ వేషములో అజ్ఞాతముగా గడుపవలసి వచ్చిన సమయమున కూడా ఏకచక్ర పురము నందలి బ్రాహ్మణ కుటుంబమును బకాసురుని బారి నుండి రక్షించగలిగినాడు. కనుక కార్యదక్షుడైనవాడు ఏ కారణము చేతనైననూ తన గొపుపతనము మరుగు పరచుకొనవలసి వచ్చిననూ, ఇతరులకు తనకు చేతనైనంత మేలు ఏదైననూ చేయగలడని భావము.

కామెంట్‌లు లేవు: