నాడి జ్ఞానం - మనిషి దేహమునంధలి నాడులు .
ఈ ప్రపంచం నందు ఎన్ని విచిత్రాలు ఉన్నాయో అంతకు మించి మనిషి దేహం నందు కలవు. భగవంతుడు తన శక్తి నంతటిని మనిషి శరీరం నందు వెన్నముక క్రింద బాగం లొ వెంట్రుక వలె ఉండు కుండలినిలో దాచాడు. మీరు మీ రెండు చూపుడు వేళ్ళని రెండు చెవులలో పెట్టుకుని ప్రశాంతం గా లోపలి శబ్దాన్ని వినండి. అదే శబ్దం మీకు కరెంటు హై టెన్షన్ వైరల దగ్గర వినిపిస్తుంది . అదే సుషుమ్న నాడి. అందలి రక్త ప్రసరణ , శక్తి ఆ శబ్దం చేయును . ఒక మనిషి ఒక మంత్రమును తీసుకుని శ్రద్ధగా అదే పనిగా ఉపాసిస్తే 41 రొజులలొ శక్తివంతుడు కావొచ్చు.
ఈ పొస్ట్ లొ మనిషి యెక్క దేహం లొని నాడులు గురించి వివరించుతున్నాను....
శరీరం నందలి మూలాధారం నకు మీదగా నాభి స్థానమునకు మధ్యంబున కంద స్థానం నందు సుషుమ్న అను నాడియోకటి కలదు. ఇళా , పింగళ నాడులు ఈ సుషుమ్న నాడిని చుట్టుకొని ఉంటాయి.మనుషుల దేహంబున సుక్ష్మ,, స్థూల నాడులు 3 కోట్ల 50 లక్షలు ఉన్నవి.ఈ నాడులు ములాదారమును ఆశ్రయించి కొన్ని ఊర్ధ్వ (పైకి ) భాగము, కొన్ని అధొ (క్రిన్ధ ) భాగము , మరికొన్ని తిర్యక్ భాగము గా వ్యాపించి ఉన్నాయి . మరియు పై నాడులను ఆశ్రయించి 3 కొట్ల 50 లక్షల రోమములు ఉన్నవి.ఈ రోమములే నాడులకు ముఖములు గా చెప్పబడును. వీటినుండే చెమట స్రవించ బడును. ఒక సుక్ష్మ వాయువు కలదు. అది ప్రాణాధి వాయువుల ద్వారా దేహమంతటికి వ్యాపించు చుండెను. ఈ నాడులలో 72 వేల నాడులు వాయు సంచార యొగ్యమై ఉండును. నదులు తమ జలములతో సముద్రాన్ని ఏ విదంగా సమృద్ది పరుచునో అదే విదంగా నాడులు మనిషి తీసుకున్న అన్నపానాదుల రసము చేత దేహమును వృద్ది చేయు చున్నది. అందు 1072 నాడులు స్థూల నాడులు గా ఉన్నవి. ఈ నాడులలో శబ్ద, స్పర్శ, రూప, రస, గందాత్మక , పంచేంద్రియ , గుణ గ్రాహకంబులు అగు నాడులే మిగుల శ్రేష్టముగా ఉండును. ఈ అయిదు నాడులు ములాదారమును ఆశ్రయించి నాభి చక్రమున ప్రవేశించి ఉన్నవి.పైన చెప్పిన స్థూల నాడులను ఆశ్రయించి నిర్మలమైన 700 ప్రదాన నాడులు సుక్ష్మ చిద్రములతో కూడి యుండును . ఇవి ప్రతి దినం మనిషి భక్షించే వివిద అన్నపానదుల రసం గ్రహించుతూ శరీరాన్ని వృద్ది చేయును .
పైన చెప్పిన నాడులలో ఇళా , పింగళ , సుషుమ్న , సరస్వతి, వారుణి, పుషా , హస్త జిహ్వ , యశస్విని , విశ్వోదరి, కుహు, శంకిని, పయస్విని, అలుమ్బస , గాంధారి అను ఈ 14 నాడులు ముఖ్యమైనవి. ఈ పదనాలుగు నాడులలో ఇళా నాడి మొదలు చారాణా నాడి వరకు గల పది నాడులు ప్రాణాధి వాయు వాహినులు అయి ఉండును. అందువలన ఇవి ప్రదాన నాడులుగా గుర్తిన్చబడుతున్నవి . ఇళా , పింగళ , సుషుమ్న అను ఈ 3 నాడులు శరీరం లొ పైబాగమునకు పోవును . గాంధారి, హస్తజిహ్వ, అను రెండు నాడులు చేతులు మొదలయినవి చాచుటకు , ముడుచుటకు ఉపయుక్తములు అయి ఉండును. ఆలంబుస, యశస్విని అను రెండు నాడులు దక్షినాంగమున ఉండును. కుహు, శంకిని, అను ఈ రెండు నాడులు వామబాగంబున వ్యాపించి ఉండును. మద్య బాగం నందు ఉండే పుషు అను ప్రసుతికా నాడి సమస్త కార్యంబులను చేయును .
వామ నాసిక యందు ఇళా , దక్షిణ నాశిక యందు పింగళ , బ్రహ్మ రంద్రంబు యందు సుషుమ్న , వామ నేత్రము యందు గాంధారి, దక్షిణ నేత్రంబు యందు హస్తజిహ్వ, దక్షిణ కర్ణంబు పుషాయు , వామ కర్ణంబు యందు యశస్విని, జిహ్వయందు ఆలంబుసం , శిశ్న ములంబున కుహువు, శిరము మీద బాగమున శంఖిని . ఇలా పది నాడులు ద్వారంబులు ను ఆశ్రయించి ఉండును.
ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము, నాగము, కూర్మము, క్రుకరము , దేహ దత్తము, దనుంజయము అను ఈ పది వాయువులు దేహమంధలి సర్వ నాడులలో సంచరించును. ఇందు ధనంజయ వాయువు అనునది మనిషి మరణించాక శరీరం ఉబ్బుటకు కారణం అగును. కర్ణముల యందు వ్యాపించు ఉండు నాడులు శబ్ద గ్రాహకములు, నేత్రముల యందు ఉండేవి రూప గ్రాహకములు, నాశిక యందు ఉండేవి కంద గ్రాహకములు, జిహ్వ యందు ఉండేవి రస గ్రాహకములు, చర్మం యందు ఉండేవి స్పర్శ గ్రాహకములు, హృదయం , ముఖము నందు ఉండునవి శబ్దోచ్చారనముకు ఉపయుక్తమై ఉండును. పురీతతి అను నాడి యందు మనస్సు లీనం అయినపుడు నరునికి నిద్ర కలుగును.
మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి