*మంత్రజపం-అందలి దోషాలు*
హరితత్త్వ ధేథితి అన్న గ్రంథంలో మంత్రాలకు ఎనిమిది రకాల దోషాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అవి అభక్తి, అక్షరభ్రాంతి, లుప్తత, ఛిన్నత, హ్రస్వత, దీర్ఘత, కథనము, స్వప్నకథనం
*1.అభక్తి:-* ఒక గురువు ఇచ్చిన మంత్రాన్ని మరొక గురువు దగ్గరకు తీసుకొని వెళ్ళి చూపించిండం, ఆ గురువేమో ఇంతకంటే గొప్ప మంత్రం నేను ఇస్తాను అని వేరొక మంత్రం ఇవ్వడం! మొదలైన దోషములే అభక్తి. గురువు ఇచ్చిన మంత్రాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. అజ్ఞానం వలన, అతి ఉత్సాహం వలన శిష్యులు అలా వేరొక గురువు వద్ద చెప్పినా ఆ గురువు ఆ మంత్రాన్ని తరచి తరచి చూడకూడదు. అదే అభక్తి. గురువు యందు మంత్రం యందు భక్తి లేకపోవడమే ఇంకొకరి వద్దకు వెళ్ళడం.
*2.అక్షరభ్రాంతి:-* గురువు గారు "ఓం హ్రీం ఓం" అని మంత్రం ఇచ్చారు. అయితే శిష్యుడికి అది సరిగా వినబడకపోవడం వలన "ఓం శ్రీం ఓం" అనుకున్న . అదే అక్షరభ్రాంతి. ఈ విధమైన అక్షరభ్రాంతి లేకుండా ఉండటం కోసమే గురువు జాగ్రత్తలు తీసుకోవాలి.
*3.లుప్తత:-* గురువు గారు "శ్రీరామ చంద్ర పరబ్రహ్మణే నమః" అని మంత్రం ఇస్తే శిష్యుడు "శ్రీ రామ బ్రహ్మణే నమః" అని జపం చేస్తాడు. అంటే గురువు ఇచ్చిన మంత్రం సరిగా జ్ఞాపకం పెట్టుకోక పోవడం వలన ఇలా జరుగుతుంది. దీని గురించి మళ్ళీ గురువును అడగలేడు. ఇది న్యూనత లోపం వలన జరుగుతుంది. అసలు మంత్రం మర్చిపోయి సొంత కవిత్వం పెట్టడం లుప్తత. కొన్ని తగ్గించి, కొన్ని తీసేసి, కొన్ని వదిలిపెట్టి మంత్రాన్ని ఉఛ్ఛరించడం లుప్తత.
*4.ఛిన్నత:-* వత్తులు ఉండవలసిన చోట వత్తులు లేకుండా పలకడం ఛిన్నత. ఉదాహరణకు ఛిన్నమస్తా అనవలసిన చోట చిన్నమస్తా అని పలకడం ఛిన్నత.
,*5.హ్రస్వత:-* ధీర్ఘం ఉండ వలసిన చోట దీర్ఘం తీసివేసి హ్రస్వంగా పలకడం హ్రస్వత . ఉధా : ఓం రాం రామాయ నమః అనడానికి బదులు | ఓం రం రామాయ నమః| అని పలకడం.
*6.దీర్ఘత:-* హ్రస్వంగా పలకవలసిన చోట దీర్ఘాన్ని చేర్చడం ఉదా : ఓం నమః శివాయ అనవలసిన చోట ఓం నామా శీవాయా అనడం.
*7.కథనం:*- గురువు ఇచ్చిన మంత్రాన్ని ఇతరుల వద్ద చర్చించడం లేక ఆ మంత్రాన్ని వేరొకరికి చెప్పడం, లేక ఇంకో గురువు వద్ద ఆ మంత్రాన్ని గురించి అడగటం మొదలైనవి కథనం కిందకి వస్తాయి. మంత్రం గురు శిష్యుల మధ్యనే ఉండాలి తప్ప మూడో వ్యక్తికి చెప్పకూడదు.
*8.స్వప్న కథనం:-* గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ చేస్తూ అలాగే నిద్రలోకి జారిపోయి ఆ నిద్రలో కలవరిస్తూ ఉంటారు కొంత మంది. లేకపోతే కలలో బయటకు చెప్పేస్తారు. అదే స్వప్న కథనం ఇది కూడా దోషమే.
హర హర మహాదేవ శంభో శంకర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి