మనసంస్కృతి సకలశ్రేయోకాంక్షి!
సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయా
సర్వే భద్రాని పశ్యంతు
మా కశ్చిధ్తుఃఖభాగ్భవేత్....
భావము :
అందరూ సంతోషముగా ఉందురు గాక, అందరూ ఆరోగ్యవంతులు అగుదురు గాక! అందరూ శుభములనే అనుభవింతురు గాక, ఎవ్వరూ బాధపడకుందురు గాక...
ఈ శ్లోకము శాంతి శ్లోకము. మన జీవితం సమాజంతో ముడిపడి వున్నది. మనము సంతోషముగా వున్నా ఎదుటివారి కష్టములో ఉన్నా, దుర్మార్గులుగా ఉన్నా మనము శాంతిని కోల్పోతాము. శాంతి పోయి భయము వస్తుంది.
మన భారతదేశ సంస్కృతి మనకు నేర్పేది ఇది. అదే "వసుదైక కుటుంబము" అందరూ సుఖ శాంతులతో, క్షేమంగా , శాంతితో జీవించటము. ఇలా అందరి మంచి కోరుకోవటం వలన మనస్సు యొక్క సంకుచిత తత్వం పోయి విశాలమవుతుంది. అపుడు మనకు తెలియకుండానే సమస్త లోకా: సుఖినోభవంతు అనే భావన మనలో కల్గుతాయి.
ఇదిసనాతన ధర్మానికి, భారతీయ సమాజ విలువలకు పట్టు గొమ్మ🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి