డాక్టర్ :- ఇబ్బంది ఏంటి మీకు?
రమేష్ :- డాక్టర్ గారూ,
రోజు రాత్రి పూట పడుకున్నప్పుడు మంచం కింద ఎవరో దాక్కున్నట్టు భయమేస్తుంటుంది .....
దాంతో నిద్ర రావడం లేదు.
డాక్టర్ :- దీనికి మీరు కంటిన్యూగా ఆరునెలలు వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది, తప్పకుండా ప్రతివారం రావాలి.
రమేష్ :- డాక్టర్ గారూ వారానికి ఫీజు ఎంతవుతుంది ??
డాక్టర్ :- మూడువేలు.
6నెలల తరువాత రమేష్ మార్కెట్ లో డాక్టర్ కి కనిపించాడు....
డాక్టర్ :- ఏమైంది రమేష్, మళ్ళీ రానేలేదు ?
రమేష్ :- డాక్టర్ గారూ,
నా ఫ్రెండ్ ఒకతను నయం చేసాడు ₹70,000 మిగిల్చాడు నాకు!
డాక్టర్ :- ఏం వైద్యం చేసాడు ...
రమేష్ :- ఏం లేదు అతను ఎమన్నాడంటే ...
మంచం అమ్మేసి పరుపు నేల మీద వేసుకుని పడుకోమన్నాడు...!!
😫😩
Morel of story is...
డాక్టర్ దగ్గరికి వెళ్లేముందు మిత్రులను సంప్రదించండి ...
మిత్రులు ఉన్నచోట పరిష్కారం తప్పక దొరుకుతుంది కనుక!
ఎప్పుడు మిత్రులను గౌరవించండి.
😊😊😊
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి