10, జులై 2020, శుక్రవారం

నమస్కారం

నమస్కారం కేవలం సమస్కారం మాత్రమే కాదు అంతకు మించి మన ఆరోగ్య సూత్రం అని నిరూపితం అయింది.

సాధారణంగా మనం పెద్దలను, గురువులనూ, అధికారులనూ కల్సినపుడు, దేవాలయాలకు వెళ్ళినపుడూ రెండుచేతులూ జోడించి నమస్కరిస్తాం.

 ఇలా చేతులు జోడించడంలోని అంతరార్ధం ఏంటీ?

 చేతులు జోడించినపుడు రెండు అరచేతులూ కలిపినపుడు పదివేళ్ళూ కలుసుకుంటాయి కదా...ఇవి ఐదు ఙ్ఞానేంద్రియాలకు ఐదుకర్మేంద్రియాలకూ సంకేతం.

 ఈ పదివేళ్ళనూ కలపడం అంటే ఙ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నింటినీ దైవంవైపు మరల్చి శరణాగత భావంతో అర్పణ చేయటమే!

 న+మమ, నాది అనేది ఏమీలేదు. అంతా నీదే! స్వీకరించు పరమాత్మా! అనే అర్పణ  భావనను కలిగి ఉండటం. 

ఇంతేకాక నమస్కారం ‘ తత్వమసి ‘ అనే నిత్య సత్యాన్ని గుర్తుచేస్తుంది. 

కుడి అరచేయి మనకు కనపడని ‘తత్‌ ’ ను సూచిస్తుంది. ఎడమ అరచేయి వ్యక్తికి ప్రతీక .రెండూ కలిసినపుడు –– తత్వమసి అవుతుంది. ఉన్నది ఒక్కడే రెండవది లేదనే భావనే! ఇది శాస్త్రీయమైన,

 సంప్రదాయమైన కారణమైతే, దీనివెనక ఎంతో సైన్స్‌ విజ్ఞానం దాగి ఉంది. అదేమిటో చూద్దాం...

నమస్కరించే సమయంలో మన చేతులకున్న పది వేళ్లు ఒకదానికి మరొకటి తాకడం వల్ల మన శరీరంలోని కళ్లు, చెవులు, మెదడు వంటి అవయవాలలో చైతన్యం కలుగుతుంది. దీనివల్ల ఎదుటివ్యక్తిని చిరకాలం గుర్తుంచుకోవచ్చనే నమ్మకం ఉంది.

నమస్కారం చేయడం వల్ల గుండె భాగంలో ఉండే చక్రం తెరుచుకుంటుంది. ఎదుటి మనిషి కూడా మనకు నమస్కరించినపుడు ఒకరికొకరు తమ ఆత్మ శక్తి ద్వారా అనుసంధానించబడతారు.

 కేవలం మాటలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కాకుండా ఆత్మానుసంధానమైన వారధి నిర్మించుకోవడానికి ఈ నమస్కారం దోహదం చేస్తుంది.

అంటే మాటలతో అవసరం లేకుండా.. ఒకరి మనసు, ఒకరు తెలుసుకునే సంబంధం ఏర్పడుతుందనేది నమస్కారం వెనక ఉన్న రహస్యం.

సైంటిఫిక్‌ రీజన్‌ ఏమిటో మరోసారి చూద్దాం...

 నమస్కారం పెట్టే సమయంలో అరచేతులని దగ్గరికి తెచ్చే ప్రతీసారీ, ఓ విధమైన శక్తి విస్ఫోటనం అవుతుంది. ఇలా చేయడం వల్ల జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరుగుతుంది. అవతలి వారికి సదభిప్రాయం కలుగుతుంది. అలా అవతలి వ్యక్తిని మనతో సహకరించే జీవిగా చేసుకుంటామన్నమాట.

యోగ లో దినకి ఏంతో ప్రాధాన్యత ఉన్నది.
దిని నేడు యావత్ ప్రపంచం గుర్తించింది.

నమస్కారం కేవలం సంస్కారం మాత్రమే కాదు మన ఆరోగ్య సూత్రం కూడా. ఏదుటి వారిని 
నమస్కరిద్దాం మన ఆరోగ్యాన్ని రక్షించుకుందాం.

కామెంట్‌లు లేవు: