10, జులై 2020, శుక్రవారం

*నోముకి వ్రతానికి తేడా ఏమిటి?:*

భగవంతుని పూజించడానికి అనేకానేక మార్గాలలో నోము , వ్రతము లు అనేవి ముఖ్యము గా స్త్రీలు పాటించేవాటిలో సాధారణమైన భక్తి విధానాలు . భగవంతుడు - దేవుడు అనేది మానవుని నమ్మకము . దండము పెట్టి దక్షిణ ఇస్తే చేసే పాపాలు పోయి పుణ్యము వస్తుందంటే నవీనకాలము లో శాస్ర ప్రరంగా నమ్మకము కుదరడలేదు . ఏది ఏమైనా మన ప్రాచీన గ్రంధాలు లలో ఉన్న ప్రకారము .... 
 *నోము* : మనస్సుని కేవలము భగవంతుని పైనే లగ్నము చేసి స్వామిని పూజించి ధ్యానము చేసేది - నోము . *ఉదా* :శ్రావణమంగళవారం నోము , అట్లతద్ది నోము . నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు. ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము. 

 *వ్రతము* : అత్యంత నియం నిష్టలతో మంత్రోచ్చాటనలతో ధూపదీప నైవేద్యాలతో భగవతుని (దేవుని లేదా దేవతను )సేవించేది వ్రతము . వ్రతము ... అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. నియమ-నిబంధనలతో ఉపవాసము తో చేసే పూజ లేక అరాధన . వ్రతము లో సంకల్పము , దీక్ష , కథాపఠనము తప్పనిసరి . వ్రతము చేయుటవలన సమస్త పాపములు పోయి ... పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి , సర్వ సౌభాగ్యములు కలుగును. ఉదా: వరలక్ష్మీ వ్రతం. సావిత్రీ వ్రతం. గౌరీ వ్రతం. మున్నగునవి .

నోము అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట.  జీవితపు నాలుగు దశలలో ఆచరించు నోములున్నవి. సంస్కృత సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి.

నోము..అంటే..కొన్ని వారాలు అనీ.. సంవత్సరాలు అనీ ఉంటుంది..నోము పట్టి అక్షింతలు వేసుకుంటే..గడువు కాలం పూర్తి అయ్యాక ఉద్యాపనతో పూర్తి అవుతుంది.

వ్రతము అంటే..ఆరోజుకే..పూర్తి చేసేది..సత్యనారాయణ వ్రతం..వరలక్ష్మీ వ్రతం.. వినాయక Vratam  లాంటివి..

ఆంధ్ర దేశమున స్త్రీలు, పిల్లలు నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. 

ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు.

మన దేశములో బాల్య వివాహములు ఆచరణలో ఉన్నందున వివాహానంతరము నోములు నోచుటయే ఆచరణలో నున్నది. ఈ వ్రతములందు త్రిమూర్తులు దేవీ సహితులై పూజింపబడుచుందురు. 

ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా కలవు. త్రిలోక సంచారియైన నారదుడు చెప్పినవి కొన్ని కలవు. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.

ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము. 

ఇతర ప్రయోజనములు భగవద్భక్తి, సదాచార సంపత్తి, ఉదయమే లేచుట, నిత్యకృత్యములు తీర్చుకొనుట, స్నానమాచరించుట, మడి వస్త్రములు ధరించుట, పచన కార్యములు నెరవేర్చుట, భక్తిశ్రద్ధలతో షోడశోపచారముల తో దైవము నారాధించుట, దైవ నివేదితమైన ప్రసాదమును అందరికి పంచి తాను స్వీకరించుట .

కొన్ని నోములు.
అంగరాగాల కథ
అక్షయబొండాల కథ
అట్ల తద్దె కథ
అన్నము ముట్టని ఆదివారముల నోము
అమావాస్య సోమవారపు కథ
ఆపద లేని ఆది వారపు కథ.

ఉండ్రాళ్ళ తద్దె కథ
ఉదయ కుంకుమ నోము
ఉప్పుగౌరీ నోము కథ
కందగౌరీ నోము కథ
కడుపుకదలనిగౌరీ నోము కథ
కన్నెతులసమ్మ కథ

కరళ్ళగౌరీ నోము కథ
కల్యాణగౌరీ నోము కథ
కాటుకగౌరీ నోము కథ
కార్తీక చలిమళ్ళ కథ
కుంకుమ నోము గౌరీ కథ
కుందేటి అమావాస్య కథ
కృత్తిక దీపాల కథ
కేదారేశ్వర వ్రతం

కైలాసగౌరీ నోము కథ
క్షీరాబ్ధిశయన వ్రతం
గంధతాంబూలము కథ
గడాపలగౌరీ నోము కథ
గణేశుని నోము కథ
గాజులగౌరీ నోము కథ

గుడిసె నోము కథ
గుమ్మడిగౌరీ నోము కథ
గూనదీపాలు బానదీపాలు కథ
గౌరీ వ్రతం
గ్రహణగౌరీ నోము కథ
గ్రామకుంకుమ కథ

చద్దికూటి మంగళవారపు కథ
చిక్కుళ్ళగౌరీ నోము కథ
చిత్రగుప్తుని కథ
చిలుకు ముగ్గుల కథ-1
చిలుకు ముగ్గుల కథ-2

తరగనాది వారముల నోము
తవుడుగౌరీ నోము కథ
త్రినాధ ఆదివారపు నోము కథ
దంపతుల తాంబూలము నోము
దీపదానము నోము కథ
ధైర్యగౌరీ నోము కథ
ధైర్యలక్ష్మీ వ్రత కథ

నందికేశ్వర వ్రత కథ
నవగ్రహ దీపాల కథ
నిత్యదానము కథ-1
నిత్యదానము కథ-2
నిత్యవిభూతి కథ
నిత్యశృంగారము కథ

నెల సంక్రమణ దీపాల కథ
పండుతాంబూలము కథ
పదమూడు పువ్వుల కథ
పదహారు కుడుముల నోము
పదారు ఫలముల నోము
పసుపు నోము గౌరీ కథ

పువ్వు తాంబూలము నోము
పూర్ణాది వారముల నోము
పెండ్లి గుమ్మడి నోము
పెద్ద సంక్రమణ దీపాల కథ
పెరుగుమీద పేరినెయ్యి కథ

పోలాల అమావా స్య కథ
పోలి స్వర్గమునకు వెళ్ళు నోము
ఫలశృతి
బారవత్తుల మూరవత్తుల కథ
బాలాది వారముల నోము

బొమ్మలనోము కథ
మారేడుదళ వ్రత కథ
ముని కార్తీకవ్రతము కథ
మూగనోము కథ
మూసివాయనాల కథ
మొగ్గదోసిళ్ళ కథ

లక్ష పసుపు నోము
లక్ష వత్తుల నోము
విష్ణుకమలాల కథ
శాకదానము కథ
శివదేవుని సోమవారపు నోము కథ
సూర్యచంద్రుల కథ
సూర్యపద్మము కథ

వ్రతములు..
శ్రీ సత్యనారాయణ వ్రతము
శ్రీ మంగళగౌరీ వ్రతము
శ్రీ వినాయకచతుర్థీ వ్రతము
శ్రీ కేదారేశ్వర వ్రతము
శ్రీ కార్తీకసోమవార వ్రతము
శ్రీ స్కందషష్టీ వ్రతము
శ్రీ సావిత్రీగౌరీ వ్రతము
శ్రీ శివరాత్రి వ్రతము
శ్రీ నందికేశ్వర వ్రతము
శ్రీ కులాచారావన వ్రతము
శ్రీ ఏకపత్నీ వ్రతము

లోకా సమస్తా సుఖినో భవంతు..!!

కామెంట్‌లు లేవు: