22, జూన్ 2021, మంగళవారం

కూలుతున్న ఆశాసౌధం

 కూలుతున్న ఆశాసౌధం 

ఆంధ్రుల ఆశాసౌధం-విశాఖ ఉక్కు కర్మాగారం 

ఆనాడు శాస్త్రీజీ చేసిన వాగ్ధానం..విశాఖ ఉక్కు 

కార్యక్రమం రూపు దాల్చుటకు ఉదయించిన ఉక్కు ఉద్యమం..దశాబ్దకాలం నిరాటంకంగా ఉద్యమపోరాటం

విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు నినాదం

అమృత రావు ఆత్మత్యాగం, అనేక బలిదానాలు 

అనంతరం-  పంట పొలాలను పణంగా పెట్టి 

భవిష్యత్తు పై ఆశలతో అధికారపాలకులకు 

అర్పించిన వైనం- ఇందిరమ్మ వేసిన పునాది..

కార్మికుల కృషితో అంచలంచలుగా ఎదుగుతున్న వైనం

ఉత్పత్తిని జాతికి అంకితం చేసిన ప్రధాని పీ వీ

ఆనాటి వేడుకలకు కట్టిన పచ్చని తోరణాలు వాడనే లేదు

మనసు పొరల్లో ఉద్యమ కారుల ఆవేదనాసెగలు చల్లారనే లేదు

లక్షల కోట్ల ధనం- వేల వేల కార్మికులు 

నిండా ఐదుపదులు దాటని ఉక్కు కర్మాగారం 

నిరంతర కృషి, దినదినాభివృద్ధితో కార్మిక స్వేదం 

నవరత్న హోదాను బహుమతిగా తెచ్చిన ఫలితం

మన్మోహన్ గారిచే ద్వితీయ ఉత్పత్తి శాఖ

ఆవిర్భావం గర్వంగా  నిలిచింది  

నలుగురు నేతలు అభివృద్ధి కి వేసిన బాటలు 

ఉద్యోగాల వేటలో ఉద్యమబాటలో ఊరట లేనేలేదు 

కష్టాలు..కన్నీళ్ళు కార్మికులకొదిలి కట్టలవెంట 

పరుగెడుతున్న ఓ రాజకీయ వర్గమా

పాపపు కూటమా..గనులు పంచనేలేదు 

బోనస్లు,యల్ టీ సీ లు ఎపుడో రద్దయినాయి 

అయినా, ఘనత సాధించిన కార్మిక ప్రగతిని 

మరుగుపరచే అవరోధాలెన్నో-ఎన్నెన్నో 

ఆధిపత్య గర్వమణచ సింహాలై గర్జించి

పారిశ్రామికవాడ పదిలపరచ సామాన్యుడు

ఉక్కు పిడికిలి బిగించి, తిరిగి సంఘటితమైన 

ఏమగునో-ఊహించగలమా?

శ్రమకోర్చు ఉద్యోగుల రక్త బిందువులే

అధికార దుర్వినియోగానికి  చరమగీతంతో

తరిమి తరిమి కొట్టు-కార్మిక మౌనం కాదు 

చేతకాని తనం-కార్మిక సంఘాల ఆక్రోశం 

అవధులు దాటిన, ఓర్పు సహనం ఊపిరిగా

జనించిన సంస్కార  సంపన్నులు 

నేడు భద్రత లేని భవిష్యత్తుకు బాధాతప్తులు

కలిగించెను నేడు మన భవితకు వేటు 

నమ్మకద్రోహుల సమైఖ్య-వెన్నుపోటు 

కార్మిక ఐక్యతతో--కాలానికి గాలం వేసి

"విశాఖ ఉక్కు--ఆంధ్రుల హక్కు ""అని 

జాతికి తెలియజేస్తాం-విజయం సాధిస్తాం

"జై విశాఖ ఉక్కు--జై జై విజయ విశాఖ ఉక్కు "" 

అదే ఆంధ్రుల హక్కు-- శీఘ్రం మనకి విజయం దక్కు

కూలుతున్న ఆశా సౌధాన్ని నిలబెడదాం...

నింగివైపు విజయపతాకం ఎగురవేద్దాం....


డాక్టర్ దేవులపల్లి పద్మజ, విశాఖపట్నం

కామెంట్‌లు లేవు: