22, జూన్ 2021, మంగళవారం

మనం చెప్పుకొనే సామెత

 మనకి తెలిసిన, మనం చెప్పుకొనే సామెత :-

ఇల్లు ఇరకాటం - ఆలి మర్కటం*.

అంటే ఇల్లు ఇరుకుగా ఉండాలి. భార్య కోతిలా ఉండాలి.

ఇల్లు ఇరుకుగా ఉంటే ఎవరూ మన ఇంటికీవచ్చి, ఎక్కువ రోజులు తిష్ట వెయ్యరు. భార్య కోతిలా ఉంటే ఆమెని ఎవరూ పట్టించుకోరు.

అని ఎవరో చేతకాని వాళ్ళు అసలు సామెతకి చేతబడి చేసేసారు.

కానీ అసలు ఈ సామెత వెనకాల మన సంస్కృతీ సంప్రదాయలు నిబిడీకృతమై ఉన్నాయని ఎంత మందికి తెలుసు????

 

        అసలు సామెత :-

" ఇల్లు ఇరు కవాటం - ఆలి మరు కవాటం**. "

అనగా " ఇంటికి ముందు, వెనుక రెండు(ద్వారాలు)తలుపులుండాలి.- భార్య తలుపు చాటుగా ఉండాలి. " అని దాని అర్థం.

ఇరు = రెండు.

మరు = చాటు, వెనుక.

కవాటం =  తలుపు.

'వాస్తు రీత్యా కానీ, భద్రతా రీత్యా కానీ ప్రతీ ఇంటికీ ముందు వైపు, వెనుక వైపు కూడా ద్వారం ఉండాలి.'

  ఇంటికి అతిథి కానీ, వేెరెవరైనా కానీ వచ్చినపుడు 'ఇల్లాలు ఎపుడూ కూడా తలుపు వెనుక నుండే సంభాషించాలి.'

ఇంత అర్థ వంతమైన సామెత. దీనిని మనం ఎంత వికృతమైన అర్థం లో వాడుతున్నామో కదా! హతోస్మి

కామెంట్‌లు లేవు: