HOME MADE HEALTH DRINK FOR ALL
గమనిక: ఈ వ్యాసాన్ని ఏదో కధ చదివినట్లుగా చదవక పూర్తిగా చదివి ఈ పొడిని మీ ఇంట్లో మీరే చేసుకొని ఆరోగ్యంగా వుండాలని, మన ధనాన్ని విదేశీ కంపెనీలకు పోకుండా ఉండాలని వ్రాస్తున్నాను.
మహిళలు: అమ్మలారా ఇక్కడ వివరించే తంత్రం చాలా సులువుగా తక్కువ ఖర్చుతో కొంచం శ్రమతో చేసుకొనవచ్చు. అనవసరంగా ధనం వృధా చేయకుండా చక్కగా మీరు మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
ఇక్కడ ఒక చక్కటి ఆరోగ్యాన్నిచ్చే హెల్త్ డ్రింక్ ను పేర్కొంటున్నాను.. ఈ రోజుల్లో మనం మార్కెట్లో దొరికే హెల్త్ డ్రింకులు అదే హార్లిక్స్, BORNIVITA , , ensure, ఏదైనా కానీయండి మీకు 200 కన్నా ఎక్కువ ధరకే 450 గ్రాములు లభిస్తున్నది. ఇంకా horlics వంటి కంపెనీలు వారి ఉత్పత్తులను విరివిగా అమ్ముకోటానికి జూనియర్, సీనియర్, వుమన్ అని రకరకాలుగా మనమీద బలవంతంగా రుద్దుతున్నారు. ఇక ensure ప్రకటనలైతే వృద్దులు యువకులకు వలె శక్తిమంతులు అవుతారన్నట్లు చూపెడుతున్నారు. 20 ఏళ్ళ బాలిక కారు టైర్ మార్చటానికి horlics తాగితే బలం వస్తుందంటే ఇప్పుడు మీరు తెలుసుకునే డ్రింక్ చేసుకొని రోజు సేవిస్తే అదే వయస్సు వున్న బాలిక లారీ టైర్ మార్చగలదు అందుకు సందేహం లేదు. మీరు మీ ఇంట్లో తయారు చేసుకోండి వాడండి మీ కుటుంబంలో అందరు శక్తి వంతులు కండి . ఇది కేవలం శాకాహార ఉత్పత్తులతో చేసింది. అందరు చేసుకోవచ్చు.
ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు: 1) మినపపప్పు 2) పాలు, 3) పంచదార
చేసుకునే విధానం.: ముందుగా చక్కగా మేనపప్పుని నీళ్లలో కడుక్కొని ఒక గిన్నెలో నీళ్లు వంపి ప్రక్కన పెట్టుకోండి. తరువాత ఒక పాత్రను తీసుకొని దానిలో సగం వరకు చిక్కటి పాలను పోయండి. పాలను స్టౌ మీద పెట్టి సన్నపు సెగలో కాచండి. పాలు కొంత కాగిన తరువాత మీరు వేరే గిన్నెలో ఉంచిన తడి మేనపప్పుని కొద్దీ కొద్దిగా వేయండి. బాగా ఉడకనీయండి. యెట్లా అంటే మనం అన్నం పరమాన్నం చేసే విధంగా. పూర్తిగా ఉడికిన తరువాత పాలు మొత్తం పప్పు పీల్చుకుంటుంది. . అప్పుడు స్టవ్ ఆర్పీ కొంత సమయం అయ్యిన తరువాత అట్లా ఉడికిన దానిని ఒక పట్టమీద ఎండలో ఆరపెట్టండి. ఎండకు ఎండి మినపప్పు వరుగులాగా అవుతుంది. చేతితో పట్టుకుంటే గల గల లాడుతుంది. అట్లా కాక పచ్చిగా ఉంటే మరుసటి రోజు ఎండలో పెట్టండి. పూర్తిగా ఎండిన పప్పును మిక్సీలో వేసి తగు మోతాదులో పంచదార కలిపి పిండి చేసుకోండి. ఆ పిండిని ఒక సీసాలో పోసుకొని నిలువ ఉంచుకోండి.
వాడే విధం: ఈ పొడిని రెండు విధాలుగా వాడ వచ్చు. 1) వేడి నీటిలో ఒకటి లేక రెండు చెంచాల పొడిని వేసుకొని కలుపు కొని టీ, కాఫి లాగ తాగ వచ్చు. 2) నీళ్లకు బదులు వేడి పాలలో కూడా కలుపు కొని తాగ వచ్చు.
ఎవరు సేవించ వచ్చు: ఈ డ్రింకును అన్ని వయస్సుల వారు ఎటువంటి సంశయము లేకుండా సేవించ వచ్చు. ఇది మంచి పుష్టిని, దండిని కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే మీరు శ్రార్ధగా తయారుచేస్తే హార్లిక్స్ కంటేకూడా రుచిగా ఉంటుంది.
ఈ డ్రింకు అందరు త్రాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
ఇట్లు
మీ
భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి