14, డిసెంబర్ 2024, శనివారం

గీతా జయంతి

 *ॐ                గీతా జయంతి*  


                      *సందేశం - 3*   


        *వివిధ ఆరాధనలు*  


*యజన్తే సాత్త్వికా దేవాన్*  

*యక్షరక్షాంసి రాజసాః I* 

*ప్రేతాన్భూతగణాంశ్చాన్యే*  

*యజన్తే తామసా జనాః ৷৷17.4৷৷* 


    *సత్త్వగుణముగలవారు దేవతలను,* 

    *రజోగుణముగలవారు యక్షులను, రాక్షసులను,*    

    *తమోగుణముగలవారు భూతప్రేతగణములను పూజించుచున్నారు.* 


*వివరణ - ప్రత్యేక గమనిక* 


    *ఎవరెవరు ఏయే గుణము కలిగియుంటారో, వారి*  

  *- స్వభావము,*    

  *- నడక,*    

  *- ఆహారము,*      

  *- మాట,*         

  *- తీరు,*    

  *- చదివే గ్రంథాలు,*        

  *- పూజించే దేవుళ్ళూ- - తదనుగుణ్యంగానే ఉంటాయి.*   


    *పూజించే దేవుని పేరునిబట్టీ పూజించు వ్యక్తియొక్క గుణములు నిర్ణయింపరాదు.*    

    *తన ఆరాధనమునకు వెనుకనున్న సంకల్పాన్నిబట్టీ వాని ఆరాధనము సాత్త్వికము, రాజసికము, తామసికము అని నిర్ణయించబడుతుంది.* 

*1. అంబరీషాదులు సత్త్వగుణ సంపన్నులై విష్ణువును ఆరాధించారు.*  

*2. శివారాధన*         

*అ) నందనారు మున్నగు భక్తులు సత్త్వగుణోన్నతులై శివుని ఆరాధించారు.* 

*ఆ) రజోగుణుడైన రావణుడు కైలాస పర్వతంక్రింద నొక్కుబడి శివుని స్త్రోత్రము చేశాడు.* 

*ఇ) భస్మాసురుడని ప్రసిద్ధికెక్కిన వృకాసురుడనే రాక్షసుడు తమోగుణ ప్రధానుడై శివుని ఆరాధించెను.*      

*3. బ్రహ్మ* 

* *సత్త్వగుణుడైన విభీషణుడు,* 

* *రజోగుణుడైన రావణుడు,* 

* *తమోగుణుడైన కుంభకర్ణుడూ ముగ్గురూ బ్రహ్మ కొరకై తపస్సునాచరించారు.*   


    *కాబట్టి బ్రహ్మ విష్ణు శివాది దైవాలనారాధించువారిలో కూడా రజోగుణ తమోగుణ ప్రధానులుండవచ్చును.*    

    *వారి సంకల్పం, శ్రద్ధలను బట్టియే ఈ నిర్ణయం జరుగుతుంది.* 



    *The Sattvic or the pure men worship the gods;* 

    *the Rajasic or the passionate worship the Yakshas and the Rakshasas;* 

    *the others (the Tamasic or the deluded people) worship the ghosts and the hosts of the nature-spirits.* 


*Commentary* 


    *Lord Krishna, after defining faith, tells Arjuna* 

    *how this faith determines the object of worship.* 


    *The nature of the faith (whether it is Sattvic, Rajasic or Tamasic) has to be inferred from its characteristic effects, viz.,   the worship of the gods and the like.* 

    *Each man selects his object of worship according to the ruling Guna of his being.* 

    *The expression of a man's faith depends on the Guna that is predominant in him.*  


    *A Sattvic man will give his faith the Sattvic expression,* 

   *a Rajasic man the Rajasic expression and* 

   *a Tamasic man the Tamasic expression.* 


   *Sattvic persons or people with Sattvic faith who are devoted to the worship of the gods, are rare in this world.* 

   *Yakshas are the brothers of Kubera, the lord of wealth; gnomes, the spirits that guard wealth.* 

    *Rakshasas: Beings of strength and power such as Nairrita; demons; giants gifted with illusive powers.Bhutas: Ghosts.* 


                         *=x=x=x=*


  *— రామాయణం శర్మ* 

            *భద్రాచలం*

కామెంట్‌లు లేవు: