*నీవిడినట్టి భిక్షయిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్*
ఈ సమస్యకు నాపూరణ.
కావర యీశ్వరా! శరణు! కారణ మీవుర కార్యమీవెరా!
స్థావర జంగమాదులును సాగును నీ కనుసన్నలందునన్
నీ వరముల్ ప్రసాదమయి నిర్మల భక్తికి నూతమాయెలే
నీవిడినట్టి భిక్షయిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్.
అల్వాల లక్ష్మణ మూర్తి.
[14/12, 8:25 am] +91 95504 67431: *అనలము నుండి లేచి హిమ మంబర మెల్లను గ్రప్పె వింతగన్*
ఈ సమస్యకు నాపూరణ.
కనలెను నగ్ని జానకిని కాల్చగ లేకను చల్లసేయుచున్
"దినకర వంశమున్ వెలుగు దివ్యచరిత్ర పునీత సీతయే
వినుమిదె రామచంద్ర!" యనె విశ్వము నంతయు హర్ష మొందగా
అనలము నుండి లేచి హిమ మంబర మెల్లను గ్రప్పె వింతగన్.
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి