14, డిసెంబర్ 2024, శనివారం

నారాయణ శతకము

 *🌹🌺సుభాషితము🌷💐*

*🌸నారాయణ శతకము.   1 భక్త పోతన*🪷 

*(సేకరణ: మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి)*


*శా. శ్రీరామామణి పాణిపంకజ మృదుశ్రీతజ్ఞ పాదాబ్జ! శృం*


*గారాకార శరీర!చారు కరుణా గంభీర! సద్భక్త మం*


*దారాంభోరుహ పత్ర లోచన! కళాధారోరు సంపత్సుధా*

 

*పారావార విహార! నా దురితముల్ భంజింపు నారాయణా!*




*తాత్పర్యం . నారాయణా! లక్ష్మీదేవి అనే స్త్రీ రత్నం యొక్క తామర పువ్వుల వంటి చేతుల మృదుత్వ శోభను తెలుసుకున్న పాదపద్మాలు  కలవాడవు శృంగారం మూర్తి భవించిన శరీరం నీది. అందమైన గంభీరమైన దయాగుణం కలవాడవు సద్భక్తుల కోరికలు తీర్చే మందార వృక్షానివి నీవు. తామర రేకుల వంటి అందమైన కన్నులు కలవాడవు. సమస్త కళలకు ఆధారమైన గొప్ప సంపదలతో అమృతమయమైన సముద్రంలో విహరించేవాడవు. నా పాపాలను నాశనం చేయుము*

కామెంట్‌లు లేవు: