చ.అపరిమితార్థ సేకరణ ఆప్తుల కెన్నుచు హాని గూర్చు వే
షపు వికటంపు చేతల నశాంతి యొనర్చుట, దైవ దూషణం
బపరిచితాళి చెప్పెడు భయమ్మును గొల్పెడు శుష్క భాషణ
మ్మెపుడు నమాయికత్వము వహించుచు నమ్ముట మోసమౌ జుమీ! !౹ 73
ఉ.ఎప్పటికేది ప్రస్తుతమొ ఎంపిక చేసి వివేకశీలురై
చొప్పడకున్నచో ఫలము శూన్యము గాన వృథా ప్రయాసతో
నెప్పటికో ఒనర్ప జయమెందును గల్గదు? కార్య సాధన
మ్మప్పరమేశ్వరుండు సదయాస్పదుడైన శుభమ్ము లబ్బెడున్౹౹ 74
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి