14, డిసెంబర్ 2024, శనివారం

అద్వైత సిద్ధాంతమే

 *శంకరులు బోధించిన అద్వైత సిద్ధాంతమే లలితా సహస్ర నామం* 

పరమేశ్వరుని మహిమ అసాధారణమైనది.  ఆయనను ఎంత పొగిడినా సరిపోదు.  అయితే ఆ పరమేశ్వరుడిని మన శక్తి మేరకు పూజించి మన జీవితాన్ని బాగు చేసుకోవాలి.

 మన పూర్వీకులు భగవంతుడిని అనేక పేర్లతో స్తుతించి ప్రయోజనం పొందారు.  వీటిలో సహస్రనామాలు అత్యంత ప్రసిద్ధమైనవి.  సహస్రనామాలలో శ్రీ లలితా సహస్రనామం విశిష్టమైనది.

 శ్రీ లలితా సహస్రనామం వేదాంత బోధనలను తెలియచేస్తుంది. భగవంతుని యొక్క సద్గుణ రూపాన్ని కూడా (సగుణ రూపo) వివరిస్తుంది, స్తుతించే రీతులనుబట్టి 

భగవంతుడు తన భక్తులను ఎలా అనుగ్రహిస్తాడో వివరిస్తుంది.  ముఖ్యంగా శ్రీ శంకరులు ప్రబోధించిన అద్వైత సిద్ధాంతం శ్రీ లలితా సహస్రనామంలో చాలా చోట్ల ప్రస్తావించబడింది.  *మిథ్యాజగత్ అతిష్టాన* *ద్వైతవర్జిత,* *తత్త్వ మార్థస్వరూపిణి* అనే నామాలు అద్వైత సిద్ధాంతాలను తెలియజేస్తాయి.  *నామపారాయణప్రీత* అనేది శ్రీమాత అనుగ్రహం పొందడానికి ఆమె నామాలను  ఎలా ? ఎప్పుడు? జపించాలో సూచించింది.

* నామ సత్యప్రసాదిని* అనే నామాన్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరుకున్నవి త్వరగా లభిస్తాయని చెబుతోంది.  అలాగే *నిర్వాణ సుఖదాయిని* అంటే మోక్షం కోసం ఆమె నామాలను జపించే వారి కోరిక నెరవేరుతుంది.అని చెప్పకనే చెబుతుంది.

 భక్తులందరూ కల్పవృక్షం వంటి కోరికలను తీర్చే శ్రీలలితా సహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా కోరుకున్న ప్రయోజనాలను పొందండి.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

కామెంట్‌లు లేవు: