6.3 మానసిక అంశ :-
మూడవ స్థాయి మానసిక అంశ. మనసుని నియంత్రించుకునే కార్యక్రమం.అన్నిరకాల ధ్యానాలూ మానసిక తపస్సు క్రిందకి వస్తాయి. కాని ధ్యానం ఒక్కటే మానస తపస్సుకి చాలదు. ప్రాధమికంగా ఉపాసన అంటే మానస తపస్సుకి చేసే ధ్యానం. కాని శరీరాన్ని, వాక్కుని నియంత్రించందే మనసుని నియంత్రించలేము కాబట్టి, కాయిక, వాచిక తపస్సులని మానసిక
తపస్సుకి తొలిమెట్టుగా భావిస్తాము. ఎందుకంటే మనస్సు సూక్ష్మమైనది. తేలిగ్గా అదుపులో పెట్టలేనిది. అందువల్ల ముందు శరీరాన్ని, వాక్కుని అదుపులో పెట్టుకోవాలి. ఇవి తర్వాత
మనసుని నియంత్రించటానికి పరోక్షంగా పనికొస్తాయి.
అందుకే ఏ ధ్యానయోగ కార్యక్రమమున్నా దాంట్లో కాయిక, వాక్ తపస్సులు కూడా ఉంటాయి. అష్టాంగయోగంలో కూడా పతంజలి ముఖ్య ఉద్దేశం మానస తపస్సే
అయినా కాయిక వాచిక తపస్సులను కూడా ప్రస్తావిస్తాడు. భగవద్గీతలో ఆరవ అధ్యాయం పేరు ఆత్మసంయమన యోగం అయినా కృష్ణభగవానుడు ఆహార నియమాలని గురించి కూడా
మాట్లాడుతాడు.మనసు,వాక్కులకు సంబంధమున్నట్టుగా, మనసు, శరీరానికి కూడా సంబంధముంది. అందుకే విపరీతమైన కోపం వచ్చినప్పుడు నిదానంగా, మర్యాదగా ఉండటం
కష్టం.అందుకని ఉపాసన అంటే ప్రాధమికంగా మానస తపస్సు. పరోక్షంగా కాయిక, వాచిక తపస్సు.
మన వీలు కోసం, అన్ని రకాల ధ్యానాలనీ నాలుగు రకాలుగా విభజించవచ్చు మన మనసులో మనం పెంపొందించుకోవాలనుకుంటున్న అంశాన్ని బట్టి.
అద్వైత వేదాంత పరిచయం
6.3.1 విశ్రాంతి ధ్యానం :- ఈ ధ్యానంలో ముఖ్యంగా మనసుని విశ్రాంతిపరచటం ఉన్నా, తక్కిన శరీర భాగాలనికూడా విశ్రాంతి పరుస్తాము. ఇందులో శారీరక విశ్రాంతి,
వాచిక విశ్రాంతి, ఇంద్రియాత్మక విశ్రాంతి యిస్తాము. అప్పుడు చివరికి మనసుకి విశ్రాంతి లభిస్తుంది. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి తగ్గించుకోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
అందుకని విశ్రాంతి ధ్యానాన్ని ఒత్తిడి నిర్మూలించే ధ్యానం అని కూడా అనవచ్చు. ప్రతిరోజూ కాసేపు విశ్రాంతిగా కూర్చోవటం సాధన చేయండి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా
అవసరం. దీనికి ఏ పద్ధతి అన్నా వాడవచ్చు. ఉదాహరణకి ఒక మంత్రాన్ని జపించటమో, మీ శ్వాసమీద ధ్యాస పెట్టటమో, లేదా కేవలం శాంతి: అనటమో చేయవచ్చు.
అద్వైత వేదాంత పరిచయం
6.3.2 ఏకాగ్రతాధ్యానం :- ఈ ఏకాగ్రత ధ్యానంలో మనసుని ఒక దానిమీద కేంద్రీకరించటం, కేంద్రీకరించే సమయాన్నిపెంచటం సాధన చేస్తాము. ప్రాపంచిక విషయం మీద
కానీ, ఆధ్యాత్మిక విషయం మీద కాని కొంత నియమిత కాలపరిమితి సేపు ఏకాగ్రత కలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.
దీనికి మన శాస్త్రంలో మూడు పద్ధతులు సూచించబడ్డాయి.
మానసపూజ - షోడశోపచార పూజ చేయటం.
మానస పారాయణం - ఏ ప్రార్థన అన్నా చేయటం
మానస జపం - ఏదో ఒక నామం తీసుకుని జపం
చేయటం.
అద్వైత వేదాంత పరిచయం
6.3.3 విశాలదృక్పధ ధ్యానం :- ఇందులో సృష్టిమొత్తాన్ని ఊహించుకుంటాము. అప్పుడే అనంత విశ్వంలో మనం చాలా, చాలా చిన్నవాళ్ళమని - దాదాపు సున్నాతో
సమానమని అర్థమవుతుంది. మనకేదో మన జీవితం గురించి, పరిస్థితుల గురించి తలకి మించిన భావాలున్నాయి. మన సమస్యలే అంతర్జాతీయ సమస్యలంత పెద్దవనీ, మనం లేకపోతే
ప్రపంచం తల్లకిందులై పోతుందనీ తెగ ఊహించేసుకుంటాం.అలాంటి తప్పుడు ఆలోచన,దేని స్థానంలో అది ఉండాలనే తప్పుడుప్రతిస్పందనలకి దారి తీస్తుంది.మన స్థానం విశ్వంలో
ఎక్కడుందో మనకొక అవగాహన
ఉండాలి. సృష్టినంతా ఊహించుకోవాలి. ఆకాశం, నక్షత్ర కూటమి, సౌర కుటుంబం, గ్రహాలు, ఖండాలు, నదులు, కొండలు, పక్షులు, జంతువులు, మనష్యులు. దీన్ని విశ్వరూప ధ్యానం
అంటారు. ఇందులో సృష్టి ప్రకరణం ఉంటుంది.
అద్వైత వేదాంత పరిచయం
6.3.4 విలువల ధ్యానం : దీన్ని మార్పు ధ్యానం అనికూడా అంటారు. ఇక్కడ మన ఆలోచనా తీరుని మార్చటం వల్ల, మనం సంపూర్ణంగా అంతర్గతంగా మారుతాము.
మనం సాధారణంగా మన ఆలోచనా తీరుని పట్టించుకోము. ఎందుకంటే, అది చాలా సూక్ష ్మంగా ఉంటుంది, క్షణంలో మాయమవుతుంది. తక్కిన వాళ్ళు చూడలేరు. కాని మన
ఆలోచనా తీరు మన జీవితాన్ని, మన గమనాన్ని, మన లక్ష్యాన్ని నిర్ణయిస్తుందన్న విషయం మర్చిపోకూడదు.
మీ ఆలోచనలని గమనించండి, అవి మీ మాటలవుతాయి.
మీ మాటలను గమనించండి, అవి మీ కార్యాలవుతాయి.
మీ కార్యాలను గమనించండి, అవి మీ అలవాట్లవుతాయి.
మీ అలవాట్లను గమనించండి, అవి మీ నడవడిక అవుతుంది.
మీ నడవడికను గమనించండి, అది మీ గమ్యం అవుతుంది.
అందుకని మీ ఆలోచన, మీ భవిష్యత్తుని నిర్ణయించే సూక్ష ్మమైన బీజం. యద్భావం తద్భవతి మీరెలా ఆలోచిస్తే, అది అవుతారు.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి