6, నవంబర్ 2020, శుక్రవారం

💫 మనో గమనము

 _*💫 మనో గమనము 🌛*_


_*వ్యవహారికంలో సర్వమూ మనస్సే. మనసు అనేది తడిసిన వస్త్రం లాంటిది. దానికి ఎరుపురంగు అద్దితే ఎరుపుగాను, నీలం రంగు అద్దితే నీలం గాను మారుతుంది. ఏ రంగు అద్దితే ఆ రంగు సంతరించు కుంటుంది. జ్ఞానము, అజ్ఞానము మనస్సు లోనిదే !*_  

            

_*ఫలానా వ్యక్తి మంచివాడు కాదు అన్నావంటే అతని మనసుకు నీచత్వం అనే రంగు వేయబడినది అని అర్థము.*_  


_*ఫలానా వ్యక్తి మంచివాడు అని అన్నాము అంటే అతని మనస్సుకు మంచితనం అనే రంగు వేయబడింది అని అర్థము.*_


_*అందుకే మంచి మనసు ఉన్న మనుషులతో సత్సంగం చేస్తే మంచి మనుషులుగా మారుతారు. అందుకే అంటారు పెద్దలు ఈ విధంగా...*_


             _*సత్సంగత్వే నిస్సంగత్వం !*_  

          

           _*నిస్సంగత్వే నిర్మోహత్వం !*_

     

              _*నిర్మోహత్వే నిశ్చలతత్వం !*_

           

           _*నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః !!*_


_*మనస్సు పాల వంటిది ఈ మనసును సంసారమనే నీటిలో కలిపితే పాలు నీరు కలిసిపోతాయి. అంటే మనసు సంసారంతో ఐక్యమైపోతుంది. ప్రపంచమనెడి సంసారంలో లీనమై పోతుంది.*_


_*అందుచేత పాలను ఒక పక్కన ఉంచి పెరుగు తోడుకున్నాక చిలికి వెన్న తీయాలి. ఏకాంతవాసంలో సాధనలు చేసి మనసు అనే పాల నుంచి జ్ఞానం, భక్తి అనే వెన్నను తీసినప్పుడు ఆ వెన్నను సంసారమనే నీటిలో ఉంచిన ఎప్పటికీ కలిసిపోదు. సంసార జలధిపై నిర్లిప్తంగా తేలుతుంది.*_


_*జీవన్ముక్తులు ఇదేవిధంగా ప్రపంచములో ఉన్నా "తామరాకు మీద నీటి బిందువు" లాగ వారికి ఏమీ అంటకుండా బ్రహ్మములో రమిస్తూ ఉంటారు.*_


_*అందుచేత మనస్సును గమనిస్తూ మనో లయము చేసి ఋషులు చెప్పిన మార్గంలో పయనించి బ్రహ్మమును పొందుదాము.*_


🙏🇮🇳😷🌞🌏🤺🥀🚩

కామెంట్‌లు లేవు: