"S T R E A S H" ( ఒత్తిడి). (సమర్పణ & సేకరణ: మజుందార్, బెంగళూర్) దీనిని మనము ఆహ్వానిస్తే "సమస్య" ఇది నేడు సాధారణముగా ప్రతి ఒక్కరికి ఉండి తీరుతుంది, ఏ మాత్రం సందేహము వలదు. ఇంటిలో వారికి డాక్టర్లకు కూడా ఉంటుంది. ఈ ఒత్తిడి లేదు అంటే వాడు "కోమా" లో ఉన్నట్టు లెక్క. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, నేర్చుకోవటం, సర్దుకుపోవడం, రిటైర్ అయినాక మరి కొన్ని రకాల ఒత్తిడులు, రాజకీయ నాయకులకు, సీటు కొరకు ఒత్తిడి, ఆ తరువాత గెలుపు కొరకు ఒత్తిడి, ఆ తరువాత పదవికోసం ఒత్తిడి, తరువాత సేవచేయుటకు ఒత్తిడి, చెప్పలేని విధమైనటువంటి సంపాదించినది దాచుకునే ప్రయత్నం లో ఒత్తిడి, ఇలా ఈ క్రింది విధంగా "ఒత్తిడి" బాధ పెడుతుంది కదూ! ఆ,. --. అలసట. ఆ" , -- ఆరోగ్య సమస్యలు(బీపీ, షుగరు, గుండె జబ్బులకు. ) "ఇ" --ఇల్లు సంపాదన. (ఇల్లు మెయింటెయిన్ చేయుటలో కోరికలు గుర్రాలు అయిన పక్షంలో) "ఈ" -- ఈర్ష ద్వేషాలు,.(మనకు ఇష్టం లేని నచ్చని వ్యక్తి కనిపించినా ) "ఉ" ---. ఉద్యోగము వ్యాపార సమస్యలు. (లాభనష్టాల గురించి, పని వారి గురించి) "ఊ" --- ఊహించుకున్న భయాలు (అపోహలు, అపార్థాలు). , "బౌతిక. సమస్యలతో ఒత్తిడి":- "శ్వాసకోస సంబంధించిన, అజీర్ణం, కడుపులో మంట, చర్మ వ్యాధులు, బి.పి, గుండెల్లో అలజడి, గోళ్ళు కొరకటం, నత్తి, నిద్ర పట్టక పోవుట, సహజముగా ఇవన్నియు అపోహ వల్ల ఎటువంటి స్థితికి మిమ్ములను తీసుకుని వెళుతుందో ఆలోచించండి. "మానసిక సమస్యలు ,"బద్ధకం, భయం, వాయిదా వేసే గుణం, ఆందోళన ,టెన్షన్, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఈ జబ్బులకు మానసిక ఒత్తిడి కారణం. , "ప్రవర్తన దోషాల వల్ల". :-పిచ్చి, కోపం, వస్తువులు విసురుట (వంట సామాను విసురుట),(సెల్ ఫోను లాంటివి) పగలగొట్టుట, మణికట్టుపై కత్తితో కోసుకో నుట, మత్తు పదార్థాలకు అలవాటు పడుట, తల దువ్వుకునే అలవాటు లేకపోవడం, శుచిగ స్నానము చేయకపోవటం, బెదిరింపు ధోరణులు, చేసేవారికి ఎటువంటి ఒత్తిడి కారణం. "ఒత్తిడి కూడా ఒక వరం లాంటిదే" :- విద్యార్థికి- పరీక్షల ఒత్తిడి;. టీచర్లకు --. సిలబస్ ఒత్తిడి,. నాయకుడు కు -- పరిపాలన పట్ల, తన సీటు పదవి పట్ల, సొంత ఆస్తులు కాపాడుకునే ప్రయత్నం;. డాక్టర్--. ఆపరేషన్/ఒ.పి లు చూచుటకు,. ."ఒత్తిడి అనేది ఒక పులి లాంటిది". పట్టుకుంటే భయభ్రాంతులను చేస్తుంది,. నిలబడితే స్నేహపూర్వక వచ్చి ఒళ్ళు కూర్చుంటుంది, మరి కుక్క లేనా అంతే పరిగెత్తి పోతే వెంటపడతాయి. అదే నిమిరితే తోక ఊపుతుంది. ,"ఒత్తిడి తగ్గించుకొనుటకు గల చిట్కాలు". :- 1)" మీ యొక్క పని ప్రణాళిక బద్దం గా ఉండాలి. 2)"మీకు నెగిటివ్ మనుషులు గుర్తించిన వారిని దూరంగా పెట్టండి. 3)"మీ ఓటమి విషయాలు పూర్తిగా మర్చిపోండి. 4)"సరదాగా నవ్వుతూ ఉండండి (లాఫింగ్ థెరఫీ చెయ్యండి). 5)"దేవుడి భజన కార్యక్రమాలు, సత్ సంఘాలలో పాల్గొనండి. 6) "ధ్యానం, ప్రాణాయామం, సూర్య నమస్కారములు చెయ్యండి. (సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి