27, ఆగస్టు 2023, ఆదివారం

 దాతలు కావలెను 


జంతూనాం నరజన్మ దుర్లభం అని  వివేకచూడామణి లో శ్రీ ఆదిశంకరాచారులవారు వచించారు.  అంటే జంతుకోటిలో అనగా 84 లక్షల జీవరాసులలో మనిషిగా పుట్టటం చాలా దుర్లభమైనది. అంతే కాకుండా ఇంకా ఆచారులవారు ఏమన్నారంటే 


జన్తూనాం నరజన్మ దుర్లభమ్ అతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్

వైదిక-ధర్మమార్గపరత విద్వత్త్వం అస్మాత్ పరమ

ఆత్మనాత్మవివేకనమ్ స్వనుభవో బ్రహ్మాత్మనా సస్స్థితిః

ముకీత్ర్ణో శతకోటిజన్మసు కృతైః పునైర్వినా లభ్యతే ॥


అంటే మనిషిగా పుట్టటం కన్నా పురుషునిగా పుట్టటం అందులోను బ్రాహ్మణుడుగా జన్మించి వైదిక్ ధర్మాన్ని ఆచరిస్తూ విద్యావంతుడు అయి ఆత్మాఅనాత్మ అనే వివేకముకలిగి స్వంతంగా బ్రహ్మజ్ఞ్యానం సముపార్జించటం అనేది తత్ద్వారా ముక్తిని పొందటం అనేది శతకోటి జన్మల సుకృతం కలిగి ఉంటే కానీ లభ్యం కాదు అని పేర్కొన్నారు. 


ఈ రోజుల్లో మనం చాలామందిమి దైవానుగ్రహం వలన బ్రాహ్మణులుగా అందునా పురుషులుగా జన్మించినాము.  నిజానికి ఇలాంటి జన్మను పొందటం మన పూర్వజన్మ సుకృతం కాక మరొకటి కాదు. ప్రతి బ్రాహ్మడు తెలుసుకోవలసినది ఏమిటంటే మనకు ఈ జన్మే ఆఖరు జన్మ కావలి అని. అది ఎట్లాగ అంటే ఈ జన్మను మనం సార్ధకత చేసుకొని బ్రహ్మజ్ఞ్యాన సముపార్జన చేస్తే కచ్చితంగా అవుతుంది.  ఈ సత్యం తెలుసుకోనుక అనేకమంది విప్రవర్యులు ఇతరులవాలె ఐహిక వ్యామోహాలకు సాంఘిక విషయ మొహాలకు బానిసలుగా మారి తమ విద్యుత్వ కర్తవ్యాన్ని మరచిపోతున్నారు.  అలాంటి మన బ్రాహ్మణ సోదరులను తట్టి లేపి వారి ఘాఢనిద్రను వదిలించి కర్తవ్యోన్ముఖులను చేయవలసిన ధర్మం, ధర్మాచరణను ఆచరిస్తున్న ప్రతి శ్రోస్త్రియ బ్రాహ్మణుడి మీద వున్నది.  కాబట్టి మనమంతా ఒక సంఘటితముగా మారి ప్రతి బ్రాహ్మణుడిని బ్రహ్మజ్ఞ్యాన సముపార్జనవైపు దృష్టిసారించే విధంగా పురిగొల్పి బ్రాహ్మణులను సత్బ్రహ్మణులుగా మార్చ ప్రయత్నం చేద్దాం. మరి అది ఎలా సాధ్యం అంటే ముందుగా ప్రతి బ్రాహ్మణుడు విధిగా " పంచ కట్టుడు పిలక పెట్టుడు చేయాలని" ఒక ఉద్యమంగా తీసుకొని అందరు  బ్రాహ్మణులు  పంచ కట్టటం  నేర్చుకొని రోజు ఉదయం బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేచి కాని పరిస్థితుల్లో సూర్యోదయ కాలంలో నయినా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గాయత్రి మంత్ర జపం చేసే విధంగా ప్రాత్సహిద్దాం. 


ఇక రెండవ విషయం అందరము చక్కగా ముండనం చేసుకొని శిఖ ధారణ చేసే విధంగా ప్రాత్సహిద్దాం. ఈ రోజుల్లో చాలామంది బ్రాహ్మణులు శిఖాదారణ అటుంచి చక్కగా కేశాలకు, మీసాలకు రంగులు వేసుకొని నవ యవ్వనులుగా కనపడుటకు అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు. మిత్రమా ఇప్పుడు నీవు చేయవలసినది నీ వయస్సును కనిపించకుండా లోకానికి కనిపించటం కాదు నీవు పరిశుద్ధుడవు అయి లోకమాతకు (భవానీమాతకు) కనిపించే ప్రయత్నం చేయి.  అప్పుడే ఆ తల్లి నిన్ను తన దారికి చేర్చుకొని ముక్తిని ప్రసాదిస్తుంది. దానికోసం విధిగా శిఖాదారణ చేసి నిత్యకర్మలను ఆచరించి బ్రహ్మజ్ఞ్యాన సముపార్జన చేసి ముక్తికోసం ప్రయత్నం చేయాలి. 


ఈ పరంపరలోనే మనలోని ఆస్తిక జిగ్న్యాసపరులు శిఖాదారణ చేసే విధంగా ప్రోత్సహించటానికిగాను పురోహితం జీవనోపాధిగా లేనటువంటి బ్రాహ్మణులకు అంటే ఇతర వృత్తి, వ్యాపార మరియు ఉద్యోగములు చేసుకొనే వారు గతంలో శిఖాదారణ చేయనివారు ఇప్పుడు శిఖాదారణ చేయటానికి పూనుకొన్న వారికి శిఖాదారణ ప్రోత్సాహకంగా కొంత ద్రవ్యాన్ని వారికి శిఖాప్రోత్సాహకంగా ఇస్తే దానికి ఇష్టపడి వారు శిఖాదారణ చేస్తారనే భావనతో ఒక ఫౌండును ఏర్పాటు చేసి ఔత్సాహక శిఖాదారాకులకు ద్రవ్యరూపంగా ఇవ్వటం సమంజసం అని భావిస్తూ ఇది వ్రాస్తున్నాను. 


విప్రులు ఈ విషయాన్ని పరిశీలించి తగువిధంగా స్పందించగలరు.  అంటే కాదు ధనవంతులైన దాతలు స్పందించి భూరి విరాళాలు ఇస్తే ఔస్తాహికులైన నూతన శిఖాదారులకు ప్రత్సాహకంను ఇవ్వవచ్చు. ప్రతివారు ఈ విషయాన్ని కూలంకుషంగా విశ్లేషణ చేసి సామూహిక నిర్ణయం తీసుకుందాం. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః 


మీ 


భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: