27, ఆగస్టు 2023, ఆదివారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 8*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 8*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే*

*మణిద్విపే నీపోపవనవతి చిన్తామణిగృహే |*

*శివాకారే మంచే పరమశివ పర్యఙ్క నిలయామ్*

*భజన్తి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ ||*



క్రిందటి శ్లోకంలో శంకరాచార్యులవారు అమ్మవారి స్ధూలరూప దర్శనం చేశారు అని చెప్పుకున్నాము.ఆ దర్శనం ఎక్కడ చేశారో ఈ శ్లోకంలో చెపుతున్నారు.


సుధా సింధోర్మధ్యే = అమృత సముద్రం మధ్యలో.

అమ్మ అమృతవతి.అమృత సముద్రమంటే అనంతమైన,శాశ్వతమైన ఆనంద సముద్రంగా భావించాలి.


సురవిటపి వాటీ పరివృతే = కల్పవృక్ష వనములతో విరాజిల్లే


మణిద్విపే = మణిద్వీపంలో


నీప ఉపవనవతి = కదంబ వృక్ష వనములో


చింతామణిగృహే = చింతామణి గృహములో


శివాకారే మంచే = శివాకారంలో ఉన్న వేదిక / మంచము పై


పరమశివ పర్యఙ్క నిలయాం =  పరమశివుని ఎడమ తొడపై కూర్చున్న అమ్మవారిని భజిస్తున్నాను.

వామాంకము భార్య స్థానము.*వామాంకే జానకీ పరిలసత్ కోదండ దండంకరే* అని భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి స్తుతి.కుడి తొడ పుత్ర పుత్రికా స్థానం.


భజంతి త్వాం ధన్యాః కతిచన = ఏ కొద్దిమందో ధన్యులు నిను ఆశ్రయించి


చిదానందలహరీమ్ = సచ్చిదానంద సాగర తరంగాలలో తేలియాడుతుంటారు.


ఈ ఎనిమిదవ శ్లోకంలో లలితా సహస్రనామాలలోని 

*శివ కామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా*

*చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా*

*మహాపద్మాటవీ సంస్థా కదంబవనవాసినీ*

*సుధాసాగర మధ్యస్థా* నామాలను దర్శించవచ్చు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: