🎻🌹🙏 బసవ పురాణం 15 వ భాగము....!!
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸గొర్రెను తాకావంటే బసవేశ్వరునిమీద ఒట్టు. శరణన్న జీవిని రక్షించడం శివభక్తుల వ్రతం అన్నాడు. దానికి విటుకు కోపించి బ్రహ్మయ్య మీదికి కత్తినెత్తాడు. అది చూచి బ్రహ్మయ్య రుద్రాకారుడై ఒకే దెబ్బతో విటుణ్ణి రెండు ముక్కలు చేశాడు.
🌿మాట తప్పిన వాడి తల ఇందుండకూడదన్నట్లు ఎగిరి గుడికవతల పడింది విటుని తల. ఈ విషయం రాజుకు తెలిసింది. బిజ్జలునికి కోపం వచ్చింది. ఎవడైనా ఒక గొర్రె కోసం మనిషిని చంపుతాడా? శివభక్తులు దయాపరులని అంటూంటావే బసవయ్యా!
🌸నిరపరాధిని ఇలా చంపడమేనా భక్తి? ఈ భూమిమీద వీరు మనుషులను బ్రతుకనిచ్చేటట్లు లేదు. లేకుంటే మీకు గొర్రెతో ఏం పని?’’ అని తీవ్రంగా బసవేశ్వరుణ్ణి చూచి అన్నాడు. బసవన్న ఈ మాటలు విని చిరునవ్వు నవ్వాడు. ‘ఎందుకలా నవ్వుతావు బసవయ్యా! మీ ధర్మాలు నాకు తెలిశాయిలే!
🌿కాలదన్నడం, మాంసఖండాలు పెట్టడం, కొడుకును చంపడం, రాళ్ళతో కొట్టడం, కులభ్రష్టత్వం చెంది భుజించడం, తండ్రిని చంపడం, భార్యనివ్వడం, ఇవేగా మీ ప్రాచీన శివభక్తుల ధర్మాలు. ఈ ధర్మపరంపరకు నేడు గొర్రె కోసం మనిషిని చంపే ధర్మం కూడా వచ్చి చేరింది.
🌸ఈ రాజ్యమేలడం ఇక నావల్ల కాదు’ అని బిజ్జలుడు క్రోధంతో అన్నాడు.
అప్పుడు బసవేశ్వరుడు ‘‘ప్రభూ! మీరు తొందరడవద్దు. శివభక్తులు ఎన్నడూ ధర్మం తప్పి చరించరు.
🌿అందులోనూ కిన్నర బ్రహ్మయ్య సామాన్యుడా? సాక్షాత్తు శివస్వరూపం, ఎవరో చెప్పిన మాటలు విని తొందరపడి ఎద్దు ఈనిందంటే గాట కట్టేయమన్నట్లు నీవు మాట్లాడుతున్నావు. న్యాయమూర్తులను పంపు ముందు. జరిగిదేమిటో పూర్తిగా విచారించు.
🌸తర్వాత ఒక నిర్ణయానికి వద్దాము’’ అన్నాడు. ‘సరే’నని బిజ్జలుడు తన ప్రధానులను గుడివద్దకు పంపాడు. వారువెళ్లి అక్కడే వున్న కిన్నర బ్రహ్మయ్యకు నమస్కరించి ..
🌿‘స్వామీ! మీ వంటి మహభక్తుడు హింసకు లోబడడానికి కారణమేమిటో మేము ఊహించలేకపోతున్నాము. లోకంలో మీకు ఎంతో అపకీర్తి వచ్చిందిప్పుడు. ఏమి జరిగిందో చెప్పండి’’ అని ప్రార్థించారు.
🌸అప్పుడు కిన్నర బ్రహ్మయ్య జరిగినదంతా వివరించి చెప్పాడు. ‘‘శరణుకోరి వచ్చిన గొర్రెను వేయి మాడలిచ్చి కొని దానికి శివలాంఛనాలు దిద్దాను. దానితో గొర్రె నంది అయినట్టే లెక్క. అట్లాంటిది మాట తప్పి ఈ విటుడు మళ్లీ వచ్చి నందీశ్వరుణ్ణి గుంజుకుపోతుంటే చంపాను.
🌿ఇందలి తప్పొప్పులకు ఈ త్రిపురాంతకుడే సాక్షి! కావాలంటే ఆయననే అడగండి. చూస్తున్నాడు మా కథనంతా గర్భగుడిలోనుండి’’ అన్నాడు బ్రహ్మయ్య.
ప్రధానులు ఈ మాటలు రాజుతో చెప్పారు.
🌸అది విని రాజు నివ్వెరపోయి ‘‘నిజంగా త్రిపురాంతకుడే స్వయంగా ఈయనకు సాక్ష్యం చెపుతాడా? ఎన్నడూ ఇలాంటిది కనీ వినీ ఎరుగమే! అదీ చూద్దాము. స్వామివారిని అలాగే సాక్ష్యం చెప్పమను’’ అన్నాడు బిజ్జలుడు.
🌿అంతా దేవాలయం వద్దకు చేరారు. ముందుగా బసవన్న కిన్నర బ్రహ్మయ్యకు పాదాభివందనం చేసి ఎన్నో విధాల ప్రస్తుతించాడు. అందరూ గుడిలోపలికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన నగర ప్రజలు కూడా గుంపులు గుంపులుగా గుడి నిండా మూగారు.
🌸గర్భగుడి అప్పుడు మూసి ఉంది. కిన్నర బ్రహ్మయ్య గుడి తలుపులవైపు ఒకసారి చిరునవ్వు నవుతూ చూచాడు. వెంటనే తాళాలు లేకుండానే తలుపులు తెరుచుకున్నాయి.
🌿అది చూచి ప్రజలంతా దిగ్భ్రాంతులైనారు.
కిన్నర బ్రహ్మయ్య గర్భగుడిలో నిలబడి ‘‘త్రిపురాంతకా’’ అని గొంతెత్తి పిలిచాడు. ‘ఓరుూ భక్తుడా!’ అని లింగం నుండి ధ్వని వచ్చింది. అది విని ప్రజలంతా గడగడా వణికిపోయారు.
🌸భూమండలం అటూ ఇటూ ఊగినట్లనిపించింది. లింగస్థులు కాని ఇతరులంతా మూర్ఛిల్లారు. అప్పుడు బసవన్న కిన్నర బ్రహ్మయ్యకు సాష్టాంగ ప్రణామం చేసి ‘బ్రహ్మయ్యా! నీవు మానవుడవు కావు.
🌿సత్యగంభీరుడవు. జగదాధారుడవు. శివ స్వరూపుడవు’’ అని స్తుతించాడు. అప్పుడు బ్రహ్మయ్య చిరునవ్వు నవ్వి ‘త్రిపురాంతకా!’ మళ్లీ పిలిచాడు. ఆ పరమేశ్వరుడు ‘ఓరుూ!’ అని మళ్లీ బదులు పలికాడు.
🌸తల్లక్రిందులైన సృష్టి మళ్లీ యధాస్థితికి వచ్చింది. బిజ్జలునితోసహా అందరికీ మళ్లీ స్పృహ వచ్చింది. బిజ్జలుడు బ్రహ్మయ్యకు సాష్టాంగపడి ‘‘బ్రహ్మయ్యా! మేము అజ్ఞులము. మమ్ము మన్నించి కరుణించు తండ్రీ’’ అని బ్రహ్మయ్యను ప్రార్థించాడు.
🌿అప్పుడు బ్రహ్మయ్య ‘రాజా! ఒక్క శివభక్తులకు మాత్రం వెరచివుండు. చాలు. నీ రాజ్యానికి ఏమీ కష్టం కలుగదు’ అని చెప్పాడు. రాజుతో సహా అంతా త్రిపురాంతకుని గుడినుండి తిరిగి తమ తమ నివాసస్థానాలకు వెళ్లిపోయాడు.
🌷కలకౌత బ్రహ్మయ్య కథ
🌸కల్యాణ నగరంలో కలకౌత బ్రహ్మయ్య అనే శివ భక్తుడొకడు ఉన్నాడు. ఆయన ఒక చేత కొమ్ము, మరొక చేత కోల ధరించి ఇంద్రజాలికుని వేషం వేసుకొని శక్తుల ఇళ్ళకుపోయి వారిని నవ్విస్తూ జంగమకోటిని సేవిస్తూ ఉండేవాడు.
🌿ఇలా ఉండగా ఒక జంగమయ్య కిన్నర బ్రహ్మయ్యగారిని దర్శించుకొందామని ఎంతోదూరం నుండి వచ్చి వచ్చి ఇక సాగలేక కూలబడిపోయాడు.
🌸శ్రమతో అతడు అలసిపోయి పడ్డచోట కలకౌత బ్రహ్మయ్య ఉన్నాడు...సశేషం..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి