6, మే 2023, శనివారం

బొప్పాయి గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

 బొప్పాయి గురించి సంపూర్ణ వివరణ  - ఉపయోగాలు .


      ఇది పులుపు , తీపి రుచులతో ఉండి దీని రసం చల్లగా ఉంటుంది. ఇది  ఫిబ్రవరి , మార్చి నెలలో మే నుండి అక్టోబర్ నెలలో కాపుకు వస్తుంది. పండు బొప్పాయి కాయ గుండెకు మంచి ఉపయోగకరం . పైత్యాన్ని తగ్గించును . కాలేయానికి ఉపయోగకరం . ప్లీహం పెద్దది అవ్వకుండా కాపాడును . మలబద్ధకాన్ని పోగొట్టును . మూత్రవ్యాధులలో అద్భుతముగా పనిచేయును .


          బొప్పాయికాయలో దాదాపు సగం గ్లూకోజ్ , మిగతాసగం ఫ్రక్టోజ్ ఉండును. మామిడికాయ తరువాత విటమిన్ "A " ఎక్కువ మోతాదులో ఇందులోనే ఉంటుంది. ఇది పక్వానికి వచ్చేకొద్దీ ఇందులో విటమిన్ " C " పెరుగును . మే నుండి అక్టోబర్ మధ్యలో వచ్చే బొప్పాయకాయల్లో పంచదార మరియు విటమిన్ " C " అధికంగా ఉండును. బొప్పాయకాయలో విటమిన్ B1 , B2 మరియు నియాసిన్ అధికంగా ఉండును.


        పచ్చిబొప్పాయకాయ నుండి వచ్చే తెల్లటి సెక్రిపన్ , పాపాయన్ అనే జీర్ణసంబంధమైన ఎంజైము ను కలిగి ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయును . పచ్చి బొప్పాయకాయను రసం రూపంలో తీసికొనవలెను . పండిన కాయను సహజరూపంలోనే తీసుకొనవచ్చు . బొప్పాయి కాయను తీసుకోవడం వలన జీర్ణప్రదేశంలో ఉండే రౌండ్ వార్మ్స్ అనే పురుగులను బయటకి పంపును . ఈ రసం కాలేయవ్యాధులను నయం చేయును . రుతుప్రవాహం సరిగ్గా ఉండటానికి సహాయపడును. రక్తవిరేచనాలు , ఆమ్లత్వం , అజీర్ణం, మలబద్దకం వంటివాటికి చాలా మంచి ఔషధముగా పనిచేయును . రక్తహీనతకు కూడా బాగుగా పనిచేయును .


         బొప్పాయి మూత్రం ఎక్కువ అయ్యేలా చేస్తుంది . కావున ఇది మూత్రపిండాల వ్యాధులలో చాలా ఉపయోగకరం . పండిన బొప్పాయి మలబద్దకాన్ని పోగొట్టును . ఆస్తమాకు మంచి ఔషధముగా పనిచేస్తుంది . పచ్చి బొప్పాయికాయలోని తెల్లటి గుజ్జు ముఖంపైన రుద్దుట వలన మొటిమల సమస్య నివారణ అగును. ముఖానికి మంచి వెలుగు తెచ్చును. ముడతలను పోగొట్టును .


  బొప్పాయిరసం శరీరంలో వేడిని పెంచును కావున గర్భిణీలు , జ్వరం ఉన్నవారికి బొప్పాయి ఇవ్వకూడదు. బొప్పాయి ఆకులను బోదకాలు నివారణలో వాడతారు.


           మరింత విలువైన మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .  


   

కామెంట్‌లు లేవు: