🦚నవతీర్ధాలు🌳
🚩🦜🚩
తుళునాడు లో అత్యంత ప్రసిధ్ధి
చెందిన స్ధలాలలో ఒకటి
కద్రీ మంజునాధ స్వామి
ఆలయం.
ఈ ఆలయం నిర్మాణానికి
వెనుక ఒక పురాణ గాధ
వున్నది. సహ్యాద్రి పర్వతాల దిగువ ప్రాంతంలో
కాశ్యప మహర్షి ఆశ్రమం వుడేది. ఆయనను అహంకారపూరితులైన క్షత్రియులు బాధిస్తూ వచ్చారు. కశ్యపుడు పరశురాముని సహాయం అడిగాడు.
క్షత్రియులతో యుధ్ధం చేసిన విజయం
పొంది సంపాదించిన భూభాగాన్ంతా
కాశ్యప మహర్షికి యిచ్చివేశాడు.
భూమిని దానం చేశాక పరశురామునికి అక్కడ
వుండాలనిపించలేదు.
భగవంతుని, " నాకని నివసించడానికి ఒక స్ధలం కావాలి" అని వేడుకొన్నాడు.
దానికి పరమశివుడు
"సహ్యాద్రి పర్వతం మీద
కదళి వనం వున్నది నీవు అక్కడికి వెళ్ళు నేను అక్కడికి
వచ్చి దర్శనం ఇస్తాను"
అని అంతర్ధానమైనాడు.
పరశురాముడు తన దివ్యదృష్టి తో ఆ ప్రాంతంలో ఒక సముద్రం వుండడం చూశాడు." సముద్ర రాజా! నీవు అక్కడ నుండి వెళ్ళిపో
నేను అక్కడికి తపస్సు
చేయడానికి వస్తాను. !"
అని సముద్ర రాజును కోరాడు. ఆనతి
కానీ సముద్రుడు
అందుకు అంగీకరించ లేదు. పరశురాముడు నిలబడిన చోటు నుండే తన గొడ్డలిని విసిరాడు. భయపడిన
సముద్రుడు దూరముగా పరిగెత్తుకుపోయాడు. పరశురాముడు ఆ
కదళివనానికి వెళ్ళి చూడగా
సముద్రుడు వదలి వెళ్ళిన ప్రాంతంలో ఒక నుయ్యి కనబడినది. అక్కడ ఆవిర్భవించిన పరమేశ్వరుడే
మంజునాధ స్వామి.
పరశురామునికి పరమశివుడు
దర్శన మిచ్చి లోక కళ్యాణార్ధమై పార్వతీ సమేత మంజునాధ స్వామిగా
అవతరిస్తాను అని తెలియజేశాడు. ఆనాటి
కదళీవనమే యీనాడు
"కద్రీ" గా మారినది.
పిదప ,పరశురాముడు సప్తకోటి మంత్రాలు జపిస్తూ
తపమాచరించాడు.
ఈ మంత్రాలే ఏడు తీర్ధాలుగా ఏర్పడ్డాయి. వీటినే సప్తకుండ్
అని పిలుస్తున్నారు.
ఇక్కడే గోముఖ అనే నంది వున్నది. ఆ గోముఖం నుండి నిరంతరం జలం ప్రవహిస్తూనే వుంటుంది. ఆ జలాలు
ఎక్కడ నుండి వస్తున్నవని
ఎవరూ కనిపెట్టలేక పోయారు.
కాశీలోని గంగే నంది ముఖంనుండి వస్తున్నదని చెప్తారు.
ఈ జలమే సప్త తీర్ధాలను ఎండిపోకుండా చేస్తున్నది. ఇవికాక మరో రెండు తీర్ధాలు వున్నాయి. మొత్తం నవతీర్ధాలుగా పిలువ బడుతున్నాయి.
ఈ తొమ్మిది తీర్ధాలు ఒక ఆలయం
లోపల వుండడం విశేషం.
ఈ నవతీర్ధాలలోను
స్నానాలు చేస్తే పాపాలు తొలగి పునీతులు
అవుతారు.
బౌధ్ధమతం ఉచ్ఛస్థితిలో వున్నప్పుడు ఆలూబా సామ్రాజ్యాని కి చెందిన
కుందవర్మ ఈ ఆలయాన్ని
బౌధ్ధమత బోధనలకి వుపయోగించు
కున్నాడని తెలుస్తున్నది.
కాని గర్భగుడిలో పరమశివుడు నెలవైయున్నాడని కుందవర్మ
తన పాలనా కాలంలో
శాసనాలు చేయించాడు
బౌధ్ధమతం బలహీనమైన తరువాత
శైవారాధన మాత్రమే జరుగుతూ వచ్చింది.
ఈ శాసనాలు
యీనాటికి ఆ ఆలయంలో
చూడవచ్చును.
త్రిలోకేశ్వరా అనే పేరుతో ఐదడుగుల ఎత్తున మూడు
ముఖములతో ఆరు హస్తాలతో ఆశీనుడై వున్న పరమేశ్వరుడు దర్శనమిస్తున్నాడు.
రాజగోపురం దాటగానే
దీపస్ధంభం కనిపిస్తుంది.
కేరళ నాడు నిర్మాణ శైలి
ప్రతిబిబించే విధంగా
ఈ ఆలయం నిర్మించబడినది.
మకరసంక్రాంతి సమయంలో
ఉత్సవాలు జరుపుతారు.
వినాయక చవితి, దేవీ నవరాత్రుల పండుగలలో ప్రత్యేక పూజలు వుంటాయి. కార్తిక మాసంలో
లక్ష దీపోత్సవం జరుగుతుంది.
పచ్చదనాల ప్రకృతి ఒడిలో
పరమేశ్వరుని దర్శనం
మనశ్శాంతిని, ఆనందాన్ని
ప్రసాదిస్తుంది.
అందరూ ఆ మంజునాధుని
దర్శించి స్వామి అనుగ్రహం
పొందండి.
కర్ణాటకలోని మంగుళూరు
నుండి 4 కి.మీ దూరంలో వున్నది మంజునాధుని ఆలయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి