12, అక్టోబర్ 2020, సోమవారం

నవవిద్రుమబింబశ్రీఃన్యక్కారిదశనచ్ఛదా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 25 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘నవవిద్రుమబింబశ్రీఃన్యక్కారిదశనచ్ఛదా’


శాస్త్ర ప్రకారము అమ్మ పెదవుల గురించి మాట్లాడకూడదు. ఇక్కడ సాధారణ స్త్రీ పెదవుల గురించి చెప్పడము లేదు. అమ్మ పెదవుల గురించి మాట్లాడటము, అమ్మని మనసులో భావన చేసి ధ్యానము చెయ్యడము ఉన్నతికి హేతువవుతుంది. ఎట్టి పరిస్థితులలో ఏవిధమైన ఉపద్రవము ఉండదు. శ్రీ అంటే ప్రకాశము. సమస్తలోకములకు సమస్త మంగళములకు ఏది హేతువో దానిని శ్రీ అని పిలుస్తారు. అమ్మవారి పెదవుల కాంతి ఎలా ఉన్నదనగా ‘నవవిద్రుమబింబ’ – విద్రుమ అంటే అది మసకబారిపోయినా, సాన పట్టకపోయినా దానిలో ఉండే ఎరుపు శోభించదు. అమ్మవారి పెదవులు సానపట్టిన కొత్తపగడము అంత కాంతి కలిగినవి. బింబ అనగా దొండపండు. అమ్మవారి పెదవులు ‘నవవిద్రుమ’ - పగడము చేత, ‘బింబ’ - దొండపండు చేత, ‘శ్రీ’ - కాంతిని ఓడించకలిగినవి. ‘రదనచ్ఛద’ – అనగా సంస్కృతములో తెర అర్థము. అమ్మవారి రెండుపెదవులు తెరయి పోల్చబడిన వస్తువుల కాంతిని తిరస్కరిస్తున్నాయి. మూసుకుని ఉన్న ఆ పెదవుల ఎరుపులో కాంతి ఉన్నది. పెదవులు తెర వలె ఉంటే మూసిన ఆ తెరవెనక ఏమున్నదో తెలియదు. అద్వైత సంప్రదాయములో అమ్మవారే ఒక తెర. శ్రీవిద్యా సంప్రదాయములో ఆవిడ పరిపాలకురాలు శ్రీమహారాజ్ఞి. ఆవిడ అనుగ్రహము కలిగితే ఆవిడ కాంతిని ఉపాసన లభిస్తే ‘మాయ’ అన్న తెరను పైకి ఎత్తితే పరబ్రహ్మములో కలసిపోవడమే. వశిన్యాది దేవతలు అటువంటి శక్తి ఇవ్వకలిగిన అమ్మ పెదవులను స్తోత్రం చేస్తున్నాము అంటున్నారు. ఇంకా చెప్పవలసి వస్తే అమ్మవారి పెదవులకు ఉపమానము లేదు. అమ్మవారి పెదవులను వక్రదృష్టితో చూడరాదు. ఒకసారి కుబేరుడు అలా చూస్తే ఆయన కన్ను మెల్లకన్ను అయింది. అవి అమ్మ పెదవులన్న దృష్టితో ధ్యానం చెయ్యాలి. ఆ పెదవులు పెరిగి పెద్దవడానికి అడ్డువచ్చిన వాటిని తొలగదోసిన హేతువులు. అనారోగ్యముతో పుట్టిన పిల్లవాడు అమ్మకి బరువు కాదు. అమ్మఅమ్మే బిడ్డబిడ్డే. అమ్మ పెదవుల ముద్రలు పిల్లవాడి మీద ఎన్నిసార్లు పడ్డాయో అవి వాడి వృద్ధికి ఆశీర్వచనములు పడినట్టు భావించాలి. మమ్ములను పోషించినదని ఆ అమ్మవారి పెదవులు కదా! అని స్మరించుకుని నమస్కరించు కోవడము అభివృద్ధికి హేతువు. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage/

కామెంట్‌లు లేవు: