12, అక్టోబర్ 2020, సోమవారం

భగవద్గీత

 

భగవద్గీత అధ్యాయం 9, శ్లోకం26.

పత్రం పుష్పం ఫలం తోయం యో మేం భక్త్యా ప్రయచ్ఛతి/తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః//.

అర్థం: పత్రం అంటే ఆకు, పుష్పం అంటే పూవు,

ఫలం అంటే పండు,

తోయం అంటే నీరు. ఎవరు భక్తి తో నాకు వీటిని సమర్పిస్తారో ఆ భక్తుల ను నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు భగవానుడు. కానీ నేటి సమాజంలో సాటి మనిషి కష్టం లో వున్నప్పుడు ఏమాత్రం స్పందించడం లేదు.భగవంతునికి పూజల పేరుతో లక్షల రూపాయలు అప్పుగా చేసి మరీ ఖర్చు చేస్తారు.అక్రమంగా సంపాదించి హుండీలో కానుకలు వేస్తారు.నిజానికి మనం సంపాదించి న ధనంతో సమాజం లో కొంత మంది కి జీవితం ఇవ్వడం ద్వారా పరమాత్మ కు ఆనందం కలుగుతుంది.ఎవరు సమాజ హితులో, ఎవరు సర్వ జీవుల పట్ల దయతో ఉంటారో, ఎవరు సాటి ప్రాణుల సుఖదుఃఖాలు తమవి గా భావిస్తారో వారు తప్పక భగవంతుని కృపకు పాత్రులు కాగలరు.భగవత్ మార్గం చాలా సుగమం గా ఉంది.. కానీ కఠినమైన నిబంధనలు ఏమీ లేవు, మానవులు కల్పించారు అంతే. భక్తులు పరమాత్మను సులభంగా పొందే మార్గం నిర్దేశించుకుందురు గాక...... ఓం నమో భగవతే వాసుదేవాయ... ఓం నమఃశివాయ శుభమస్తు......🌹🙏🏼🌹

కామెంట్‌లు లేవు: