12, అక్టోబర్ 2020, సోమవారం

మేము అధికారంలో కనుక ఉండి ఉంటే

 మేము అధికారంలో కనుక ఉండి ఉంటే 15 నిముషాల్లో చైనాని 100 కిలోమీటర్లు వెనక్కి నెట్టి ఉండేవాళ్లం - రౌల్ విన్సీ.

ఇది రౌల్ విన్సీ టిపికల్ & క్లాసిక్ కామెంట్. హర్యానాలో ఒక సభలో మాట్లాడుతూ రౌల్ విన్సీ ఆవేశంగా అన్న మాట ఇది. ప్రతిపక్షం అన్నాక ఏదో ఒకటి అతిశయోక్తులు మాట్లాడుతుంది కానీ ఇది చాలా టూ మచ్ ! రౌల్ విన్సీ అన్నట్లు చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుందా ? ఒకసారి అదేంటో చూద్దాం.

పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ప్రాంతం(POK): 13,297 కిలోమీటర్లు [1947].

గిల్గిట్ - బాల్టిస్తాన్ ప్రాంతం: 64,817 కిలోమీటర్ల ప్రాంతం [ఇది POK లోనే ఒక భాగం].

షాక్స్గామ్ ట్రాక్ట్: ఇది 6,993 కిలోమీటర్ల ప్రాంతం పాకిస్తాన్ చైనాకి ఇచ్చింది 1963 లో.

ఆక్సాయ్ చిన్ ని 1962 లో చైనా ఆక్రమించుకుంది దీని వైశాల్యం: 37,244 కిలోమీటర్లు.

1950, 1962 లలో అప్పటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ హయాంలోనే చైనా, పాకిస్తాన్ లు పైన పేర్కొన్న ప్రాంతాలని ఆక్రమించుకున్నాయి.1950 లో భారత భూభాగంలోకి చైనా చొరబడి చాలా లోపలకి రోడ్ వేసింది కానీ ఈ విషయం అప్పటి ప్రభుత్వానికి అంటే నెహ్రూకి తెలియదు. 1947 నుండి దశాబ్దాల పాటు కాంగ్రెస్ దేశాన్ని పరిపాలించింది కానీ ఎప్పుడూ మా భూభాగాలు మాకు ఇచ్చేయమని అడగలేదు. పైగా నెహ్రూ ఆక్సాయ్ చిన్ గురుంచి మాట్లాడుతూ అక్కడ గడ్డి పరక కూడా మొలవదు దాని గురుంచి ఎందుకు ఆందోళన పడతారు అంటూ ఎదురు ప్రశ్న వేసేవాడు. రౌల్ విన్సీ భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ గురుంచి మాట్లాడతాడు కానీ వాళ్ళ తాత అప్పట్లో అంటే 1962 యుద్ధంలో ఆర్మీకి సహాయంగా మన ఎయిర్ ఫోర్స్ ని పంపించడానికి నిరాకరించాడు అన్న సంగతి తెలియదు. అవును 1962 యుద్ధం లో మన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సహాయం కోసం అడిగితే చాలా బ్లంట్ గా తిరస్కరించాడు[ఈ ఒక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి నా తరువాతి పోస్ట్ లో ఇదే విషయం మీద చర్చిద్దాము ఎందుకంటే దీనికి ఇంకో విషయానికి లింక్ ఉంది]. ఒకవేళ నెహ్రూ కనుక మన ఎయిర్ ఫోర్స్ ని ఆర్మీకి సపోర్ట్ గా పంపించి ఉంటే విషయం వేరేగా ఉండేది. దీనిమీద ఓ డజను పుస్తకాలు వ్రాసారు వివిధ సైనికాధికారులు, రక్షణ రంగ నిపుణులు.

మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ శ్రీ డెంజిల్ కీలర్ [Denizil Keelor] గారు అప్పటి విషయాన్ని ప్రస్తావిస్తూ నెహ్రూ ఎయిర్ సపోర్ట్ ఇవ్వలేదు కదా కనీసం చలికి తట్టుకునే బట్టలు కూడా ఇవ్వలేదు అన్నాడు అసలు చైనా చేతిలో కంటే ఆకలి, చలికి చనిపోయిన భారత సైనికులే ఎక్కువ. వీడియో చూడండి మీకే అర్ధమవుతుంది.

రౌల్ విన్సీ మాట్లాడుతూ 1200 sq km ప్రాంతం భారత్ కోల్పోయింది అంటాడు అయితే కమ్యూనిస్ట్ పత్రిక 'ది హిందూ' లో 1000 sq km ల డెస్పాంగ్ ప్రాంతం అని వ్రాశాడు అంటే హిందూ పేపర్ లో వ్రాసిన 1000 km లకి రౌల్ విన్సీ మరో 200 km కలుపుతున్నాడు. వీళ్ళ అబద్ధాలకి అంతే ఉండదు. అసలు డెస్పాంగ్ ప్రాంతం లో పెట్రోలింగ్ పోస్ట్ లు ఉండేవి అక్కడ భారత సైనికులు కాపలా, పెట్రోలింగ్ నిర్వహిస్తుండేవారు 2013 వరకు. 2013 లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే డెస్పాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చి వాళ్ళ పెట్రోలింగ్ పోస్టులు నిర్మించుకున్నారు. కొన్నాళ్లు భారత సైనికులు చైనా సైనికులు ఎదురెదురుగా మోహరించారు కానీ ఇవేవీ అప్పుడు ఎలెక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ రాలేదు. 2013 నుండి డెస్పాంగ్ ప్రాంతం మీద భారత్ సైనికులు పట్టు కొల్పోయారు. కనీసం చైనా వాళ్ళని వెనక్కి తరిమేయండి అని కూడా చెప్పలేకపోయింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. తరువాతి రోజుల్లో మన సైనికులు చైనా వాళ్ళ పోస్టులని ధ్వంసం చేయబోయేలోపు వాళ్ళంత వాళ్ళే వెనక్కి వెళ్ళిపోయారు కానీ అప్పటికే కీలకమయిన కొన్ని ప్రాంతాలని వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకున్నారు ఇప్పటికీ. 

•Tia Pangnak: 2008

•Chabji Valley :2008

•Doom Chaley :2009

•Demzok :2012

•Raki Nula: 2013.

ఈ ప్రాంతాలు ఎవరి పాలనలో చైనాలో కలిసిపోయాయి ? కనీసం ఏ మీడియా అన్నా రాహువుని ఈ ప్రాంతాల సంగతేమిటీ అని ఎందుకు అడగవు ? కమ్మీ పత్రిక హిందూ ఎందుకు ఈ విషయాలని దాచి పెడుతున్నది ? ఇప్పుడు ఏదయితే 1200 km అంటున్నాడో రౌల్ విన్సీ ఈ నంబర్ తరుచూ పెంచుకుంటూ వెళ్ళిపోతాడు చూడండి. ఇదే రౌల్ విన్సీ ఖాంగ్రెస్ జెనెరల్ సెక్రటరీ గా ఉన్నప్పుడు ముంబై మీద దాడి జరిగింది. ఎంతమంది ప్రజలు, పోలీసులు, సైనికులు మరణించారో మనందరికీ తెలిసిందే. అప్పుడు మాత్రం నోరు మెదపలేదు కానీ ఇప్పుడు సూక్తులు వల్లిస్తున్నాడు. ఆగస్ట్ 29, 30 వ తేదీలలో మన సైన్యం అఫెన్సివ్ గా వెళ్ళి ఎంత ప్రాంతాన్ని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకుందో దాని గురుంచి మాట్లాడడు. అసలు మొదటి సారిగా భారత సైన్యం చైనా మీదకి ఎదురు దాడికి చేసింది గత ఆగస్ట్ 29, 30 రోజునే. భారత సైన్యాన్ని ఎప్పుడూ ఆత్మరక్షణ కోసమే ఉపయోగించారు కానీ ఎదురు దాడి చేయడానికి ఉపయోగించలేదు ఇప్పటి వరకు. భారత సైన్యానికి స్వేచ్చని ఇచ్చి మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి అని ప్రధాని మోడీ గారు చెప్పిన తరువాతే మొదటిసారిగా మన సైన్యం ఎదురుదాడి చేసింది. అసలు ఆగస్ట్ 29, 30 ల తరువాత అంతే గత 40 రోజులుగా చైనాకి ఏం చేయాలో తెలియని స్థితిలోకి నెట్టేసింది భారత్. అసలు ఒక్క అడుగు ముందుకు వేయమనండి చైనాని ఇప్పుడు. 'ఉన్నదీ పోతుంది ఉంచుకున్నదీ పోతుంది'. ఆ సంగతి చైనా వాళ్ళకి అర్ధమయినంతగా రౌల్ విన్సీ కి అర్ధమవట్లేదు అఫ్కోర్స్ అర్ధమవడానికి కొంచెం బ్రెయిన్ ఉండాలి కదా ? 'ఒక మెషీన్ లో ఒకవైపు ఆలుగడ్డలు వేస్తే ఇంకో వైపు నుండి బంగారం వస్తుంది' అన్నప్పుడే అతని మెదడు ఎక్కడ ఉందో దేశ ప్రజలకి తెలిసిపోయింది కానీ కాంగ్రెస్ కార్యకర్తలకే తెలియట్లేదు పాపం ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టేస్తున్నారు తెగ ఆయాసపడిపోతూ. అసలు మన దేశంలో కమ్యూనిస్టుల కంటే కాంగ్రెస్ వాళ్ళే చైనాకి మద్దతుగా మాట్లాడుతున్నారు రౌల్ విన్సీ తో సహా. అసలు వీళ్ళు చైనాతో చేసుకున్న ఒప్పందం(MOU) లో ఏముందో ఎందుకు చెప్పరు ? చైనాని ఒక్క మాట కూడా అనలేని నిస్సహాయ పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయారు ? అరుదయిన ఖనిజాలు ఉండే ఇసుకకి, వీళ్ళ MOU కి ఏదన్నా సంబంధం ఉందా ? ఇంతకీ ఆ ఇసుక ఎంత ఖరీదు చేస్తుంది ? ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది ? ఇవన్నీ ఎప్పుడు బయటికి వస్తాయి ? ఈ వివరాలు బయటికి వస్తే ఒక్క బులెట్ కూడా పేల్చకుండానే చైనా ఆక్సాయ్ చిన్ ని మనకి తిరిగి ఇచ్చేసి వెనక్కి వెళ్లిపోతుంది అంటే నమ్ముతారా ? నిజాలు బయటికి వస్తే నమ్ముతారు. రావాలనే ఆశిద్ధాము. 

జై హింద్ !

పార్ధసారధి పోట్లూరి.

సేకరణ

కామెంట్‌లు లేవు: