.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
శా||
ఏకే మేకయి నొంచుకాలమిది నేనెవ్వారి నమ్మంగనౌ
లోకేశా! భవ దంఘ్రియుగ్మమువినా; లోపాలు సైరించి, రా
రా! కళ్యాణ గుణాకరా! భవహరా! రక్షింపరా సత్యృపన్
చీకాకుల్ దొలగించి; మ్రొక్కెదనిదే శ్రీ సిద్ధలింగేశ్వరా!
భావం;
ఏకు మేకు అవుతుంది అనే సామెత లాగా మంచివాడు అని చేరదీస్తే నెత్తిన మేకులా తయారయ్యే వాళ్లుండే ఈ లోకంలో నీ దివ్య పాద పద్మాలు తప్ప,ఇక వేరెవరిని నమ్మగలను స్వామీ?
నా లోని లోపాలను సరిదిద్దటానికి రావయ్యా! సమస్త పాపాలను తొలగించి, సకల శుభాలను ప్రసాదించే దయమయుడా!
నీ కృపతో నా చికాకులను తొలగించి నన్ను కాపాడమని ప్రార్థిస్తున్నాను స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి