ధార్మికగీత - 31*
*****
*శ్లో:- చితా చింతా ద్వయో ర్మధ్యే ౹*
*చింతా నామ గరీయసీ ౹*
*చితా దాహతి నిర్జీవమ్ ౹*
*చింతా ప్రాణయుతం వపు: ౹౹*
మనుజుని గాల్చు యా చితియు ,
మానసమందలి చింత , రెండిటన్
ననయము చింతయే గరిమ ,
నా చితి జీవములేని వానినే
పనిబడి గాల్చు , చింత మరి
పట్టియు గాల్చును బ్రతికి యుండగన్ ,
మనదగు జీవితంబునను
మానవు డెప్పుడు చింత వీడియున్
✍️ గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి