*ఆది నిష్టూరం*
ఆసామి దగ్గర పడుగు పేక తెచ్చుకుని, మగ్గముపై చీరలు తయారుచేసి జీవనం సాగుంచేవారు వాసు సుమతి.
వారి పెళ్ళప్పుడు సుమతి నాన్న సరిగపంచె సరిగ కండువా అల్లుడికి పండుగకు పెట్టాడు.
వారింటిముందు వేపచెట్టు అరుగు వుంది.
దానిపై కూర్చుని పిచ్చాపాటి కబుర్లు చెప్పేవాడు నరసయ్య అనే పెద్దమనిషి.
ఓరోజు వాసు ఉండబట్ట లేక తన గొప్పతనం చాటుకోవాలని మామ పెట్టిన పంచె కండువా చూపించాడు నరసయ్యకు.
మరునాడు"వాసూ! పట్నంలో పెద్దవారితో పనిబడింది. కాస్త నీ పంచె కండువా ఇవ్వు మళ్ళీ ఉతికి తోమించి ఇస్తాను."
పెద్దాయనకదా అని ఇచ్చాడు.
పదే పదే అడిగు తీసుకుపోయాడు. వాటికి పొగరు తగ్గిపోయింది.
అంత్యనిష్టూరంకన్నా ఆది నిష్టూరం మేలని నేను మొత్తుకున్నాను నామాట పెడచెవిన బెట్టారు వాటి దగ్గర ఏముంది? "
వాసు మెతక కావడంతో కాదనలేక పోయాడు.
ఓ రోజుకు బట్టలకోసం వచ్చాడు నరసయ్య. సుమతికి వళ్ళు మండిపోయింది"నరసయ్య గారూ! మా నాయన ప్రేమతో మాకు నేసి ఇచ్చాడు. మొత్తం నువ్వే అనుభవించావు .అవిపోతే మాకు ఎవరు తీసిస్తారు? కావలసినంత డబ్బు వుంది కదా నెత్తినబెట్టుకుని పోతారా? గుడ్డలుకూడా కొని వేసుకోలేరా మరీ ఇంత పిసనారి తనమా"అంటూ విదిలించి కొట్టింది.
నరసయ్యకు కోపమొచ్చి తుర్రున వెళ్ళి పోయాడు. మరునాడే అదేరకం పంచె కండువా కట్టుకుని చూపించడానికి అరుగుమీదకొచ్చి కూర్చున్నాడు నరసయ్య.
ఓరోజు నరసయ్య పొరుగూరికిపోయి వస్తున్నాడు. ఏటిలో చాకలి అదేపంచె కండువా ఆరబెట్టి వున్నాడు.వాటిని చూడగనే వళ్ళు మండిపోయింది .ఇవి వాసుగాడివి అని ప్రక్కనే మేస్తున్న పశువులను వాటిపైకి తోలాడు. కళ్ళు చల్లబడ్డాయి.
సాయంత్రం చాకలి వచ్చి"అమ్మగారూ! ఏటిలో ఆరబెట్టివుంటే అయ్యగారి బట్టలు ఏ పశువులో తొక్కి ముక్కలు చేశాయి. క్షమించండమ్మా"
అంటూ ఏడుపుముఖం పెట్టాడు.
తనకు తెలియకుండా పంచె కండువా ఏసినందుకు భార్యను తిట్టి తల బాదుకున్నాడు నరసయ్య.
✍🏻జంజం కోదండ రామయ్య
*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి