21, జులై 2020, మంగళవారం

తత్త్వ విచారణ 616వ నామ మంత్రము


ఓం ఐం హ్రీం శ్రీం అమేయాయై నమః🙏🙏🙏కొలతలకు, వచనములకు, నిర్వచనములకు, ప్రవచనములకు, నుతులకు, నేత్రములకు, మనో నేత్రములకు పరమేశ్వరి ఫలానా అని  చెప్ఫుటకలవి కాని తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి అమేయా అను  మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును భక్తిశ్రద్ధలతో ఓం ఐం హ్రీం శ్రీం అమేయాయై నమః అని ఉచ్చరించుచూ ఉపాసించు భక్తులకు ఆ జగన్మాత అనన్యభక్తిప్రపత్తులను కలుగజేసి, ఆత్మానందానుభూతి ప్రసాదించి అనుగ్రహించును🌻🌻🌻అన్నింటికి అతీతమైన పరబ్రహ్మాన్ని కేవలం సాధనతో అనుభూతమొనర్చు కోవాలి. అయితే సగుణ సాకార రూపము, తల్లి భక్తుల నిమిత్తం ధరించునది మాత్రమే. కాని జగన్మాత స్వరూపము సగుణ, సాకారమునకు, నిర్గుణ, నిరాకారమునకు కూడా అతీతమైనది🌺🌺🌺అమేయా అనగా కొలుచుటకు, నిర్వచించుటకు సాధ్యము కానిది🌻🌻🌻 యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా మన వాక్కుకు, మనస్సుకు అందనిది. చింతింప నలవికానిది. సర్వమునకు అతీతమైనది. నాయమాత్మ ప్రవచనే న లభ్యః. శ్రీమాత ప్రవచనాలకు, వచనాలకు, నిర్వచనాలకు అందనిది. ఆత్మేశ్వరి అయిన పరాశక్తి పరదేవతా🌸🌸🌸 ఇయానితిమాతుం పరిచ్చేత్తుం న శక్యతే సర్వ ప్రపంచమునకు, ఆత్మస్వరూపమై, అనంతమై, గణించుటకు, విభజించుటకు, సాధ్యముకానిదై, సర్వజీవులలో నేను, నేను అని తెలియబడుచున్నదో, దృశ్యమానమైన జగత్తుకు దృక్కురూపమున ఉండునది అని తెలియవలయును. ఏది నిత్యమై ఉన్నదో, దేనిని సత్యమని, అపరిచ్ఛిన్నమని, అనంతమని, విజ్ఞానమని, ఆకాంక్షేయమని, ఆనంద స్వరూపమనియు, స్వతఃప్రమాణమనియు, ఏ మహాతత్త్వము తెలియబడుచున్నదో దానినే అమేయాత్మ అంటారు🌹🌹🌹అట్టి అమేయాత్మకు నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం  శ్రీం అమేయాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
[2:44 am, 21/07/2020] P.Dutga Subramanyam: 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
39వ నామ మంత్రము

ఓం ఐం హ్రీం శ్రీం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః🙏🙏🙏పరమేశ్వరునికి (శ్రీమాత భర్తకు) మాత్రమే తెలిసిన సౌభాగ్యశ్రీలతోను మృదుత్వంతోను కూడిన ఊరువులు కలిగిన శ్రీమాతకు నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి  కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని ఉచ్చరించుచూ శ్రీమాతను పూజించు భక్తులకు ఆ తల్లి ఆత్మానందమును, బ్రహ్మానందమును ప్రసాదించి కరుణించును🌻🌻🌻కామేశ (కామేశ్వరునకి మాత్రమే) జ్ఞాత (తెలియబడిన) సౌభాగ్య మార్దవ (సుందరతయు - భాగ్యవత్వము గల్గిన) ఊరుద్వయ అన్వితా (ఊరు ద్వయంతో కూడినది🌺🌺🌺శ్రీమాత ఊరువుల సౌందర్యము, మృదుత్వము కామేశ్వరునికి మాత్రమే తెలియును. కామేశ్వరుని యెడ శ్రీదేవి అనన్యాసక్తయని భావము. శ్రీచక్రవాసులైన ఆ జంట అవిభాజ్యము అని సారాంశము🌸🌸🌸🌸 ఊరు శబ్దమునందలి ఊ శబ్దమును విడదీయగా ఉ-ఊ అని రెండు వర్ణములు వచ్చును. ఉ అనునది వామోరువు (ఎడమ తొడ), ఇది సౌభాగ్యమునకు సంకేతము. ఊ అనునది దక్షణోరువు (కుడితొడ) మృదుత్వమునకు సంకేతము. ఊరుద్వయ మధ్యస్థానమే రత్నమణి,  మణి అని  రెండు సంఖ్య నామములచే ఒప్పుచున్నది. ఇవి పర-అపర అని తెలియదగును🌹🌹🌹దక్షిణోరువు 8 భాగములు; పంచభూతములు - 5, మనస్సు, బుద్ధి, అహంకారము - 3 మొత్తము 8 భాగములు. వామోరువు 8 భాగములు; ఇవి చాతుర్వర్ణములు అందలి స్త్రీపురుష భేదాలు గాన రెండు నాలుగులు 8 భాగములు; వామ, దక్షిణోరువుల మొత్తం 16 భాగములు. రెండు ఊరువులను ఉ-ఊ లతో సంకేతిస్తే ఉ లావణ్యము, ఊ లాలిత్యము తెలుపుచున్నవి. ఈ లావణ్య-లాలిత్య సంధానక ప్రియమైన కామేశ్వరి కామేశ్వరునికే పుర్ణముగా తెలియునని అర్థం చెప్పవచ్చును🌹🌹🌹శ్రీమాతకు నమస్కరించునపుడు  ఓం ఐం హ్రీం శ్రీం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319

కామెంట్‌లు లేవు: