21, జులై 2020, మంగళవారం

ఇకనైనా ప్రశాంతంగా ఉండండి

   ఇకనైనా ప్రశాంతంగా ఉండండి ... ముఖ్యంగా అతిగా భయపడుతున్నవారు

ఇప్పటికే 40-50 % మంది కరోనా వచ్చినోళ్ళూ , వచ్చిపోయినోళ్ళూ ఉంటారు ... 

     అంటే వీళ్ళందరిలో కోవిడ్ యాంటీ బాడీస్ ఉంటాయ్ ... వీళ్ళకి మళ్ళీ కరోనా సోకినా అది ఎక్కుసేపు ఉండదు వీరిలో ... 

     కాబట్టి వీరినుండి ఇంకొకరికి సోకే అవకాశం ఉండదు.

అలా చైన్ కట్ అయి , ఆఖరుకి ఎవరి నుండి ఎవరికి వ్యాప్తి అవ్వాలో తెలీక ఆగిపోతుంది.

ఈ జూలై ఆఖరుకంతా కేసులు తగ్గడం మొదలై , ఆగస్ట్ లో  ఆఖరుకంతా కరోనా అంతమైపోయే అవకాశాలే ఎక్కువ...

*వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే.   ఇది ఒక నిర్జీవి. *

*ఇది కంటి, ముక్కు,గొంతు లోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్ ను మార్చుకొని, ఆ కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్యలో వృద్ధి అయ్యేవిధంగా చేస్తుంది. *  
    
* వైరస్ అనేది జీవి కాదు కాబట్టి, దీనిని చంపడం అనేది జరుగదు. దానంతట అదే క్షయమవుతుంది ( నాశనం).*

*వైరస్ క్షయం (నాశనం) అయ్యే సమయం ఉష్ణోగ్రత, గాలిలో తేమ & అది ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది. *                          

*వాస్తవానికి వైరస్ చాలా బలహీనమైనది. తేలికగా విచ్చిన్నమయ్యే  గుణం కలిగినది. కానీ దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది. *

* అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటినుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది.*

* అందుకే సబ్బు తదితర పదార్థాలతో కనీసం 30 సెకండ్లు గట్టిగా రుద్దమని చెబుతారు.* 

*సబ్బుతో రుద్దడం వలన కొవ్వు కణాలు విచ్చిన్నమై, లోపలవున్న వైరస్ ( ప్రోటీన్) కూడా దానంతట అదే విచ్చన్నమౌతుంది. *

*వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్రపరచుకోవాలి. *

*వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉన్నది.  నురగ ఎంత ఎక్కువగా ఉంటే, వైరస్ ను అంత సులభంగా కరిగించగలం. *
                  
*కొవ్వులు ఆల్కహాల్‌ లో కరుగుతాయి. అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్‌ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు. *

*ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించినట్లయితే వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు. *

*హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ ( వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది. అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు. *

* వైరస్ నిర్జీవి కనుక దానిని Anti Biotics నిర్వీర్యం చేయలేవు. కానీ వాటి నిర్మాణాన్ని కొంతమేరకు కుదించగలవు. Anti Biotics బాక్టీరియాను మాత్రమే  చంపగలవు.*

*ఉపయోగించిన లేదా ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయరాదు. ఎందుకంటే వాటిలో వైరస్ ఉంటుంది కాబట్టి. *  

* వైరస్ నిర్వీర్యం కాకుండా/ నిలచి వుండే సమయం:*

* వైరస్ బట్టలపై - 3 గంటల వరకూ* 

* సహజసిద్ధమైన ఏంటిసెప్టిక్ అయిన రాగిపై - 4 గంటలు*

* చెక్కపై - 4 గంటలు* 

* కార్డ్ బోర్డు పై - 24 గంటలు*

* లోహాలపై - 42 గంటలు*

 * ప్లాస్టిక్ పై - 72 గంటలు నిర్వీర్యం కాకుండా ఉంటుంది.*


*వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపినపుడు వైరస్ గాలిలో కలసి సుమారు మూడుగంటలు ఉండే అవకాశం ఉంది. అటువంటి గాలిని మనం పీల్చినప్పుడు వైరస్ మన ముక్కు ద్వారా ఊపిరితిత్తుల లోనికి ప్రవేశిస్తుంది. *

*వైరస్ లు చల్లని వాతావరణం లో, ఎయిర్ కండిషనర్ల కారణంగా ఏర్పడే కృత్రిమ చల్లదనంలో మరియు చీకటిలో వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి. *

* కావున మన పరిసరాలను తేమలేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురు తో వుండేలా చూసుకోవాలి.*

* ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.*

*అల్ట్రా వయొలెట్ కిరణాలు కూడా వైరస్ లోని ప్రోటీన్ లను విచ్చిన్నం చేస్తాయి. కానీ UV Rays చర్మంపై పడితే ( మన చర్మం లోని కొలాజిన్ అనే ప్రోటీన్ ను విచ్చిన్నం చేస్తాయి) చర్మ కేన్సర్ వచ్చే అవకాశం వుంటుంది. *

*ఆరోగ్య వంతమైన మానవవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరం లోకి ప్రవేశించలేవు. *

*వెనిగర్ వలన ఉపయోగంలేదు ఎందుకంటే వెనిగర్ కు  కొవ్వు లను కరిగించే శక్తి లేదు. *

*స్పిరిట్, వోడ్కా లవలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం ఎందుకంటే వాటిలో 40% కన్నా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. *

*వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి. *✅

*65% ఆల్కహాల్ కలిగిన శానిటీజర్స్, లిస్టరిన్ వలన కొంత ఉపయోగం ఉంటుంది. * 

*తక్కువ వెలుతురు, గాలి కలిగిన  ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. *

*విశాలమైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది. *

*చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది. *

*మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే వైరస్ ను విచ్చిన్నం చేయడానికి అంతగా ఉపయోగపడుతుంది. *

*గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా   గోళ్ళ పరిమాణం చాలా తక్కువ వుండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే. *

            * Note:* 

ఇనుముపై 12 గం. ల వరకూ వుంటుంది - కాబట్టి

*తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్ లు, రిమోట్స్, సెల్ ఫోన్, వాచీలు, కంప్యూటర్ లు, డెస్కులు, టివిలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు, బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు, భోజనానికి ముందు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 10 ని.ల కు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి. *✅

* మీకు కరోనావైరస్ ఉందని ఎలా తెలుసు?*

 1. గొంతులో దురద,
 2. పొడి గొంతు,
 3. పొడి దగ్గు.
4. జలుబు, తలనొప్పి నుండి తీవ్ర జ్వరము కూడా వస్తుంది.

 కావున మీరు ఈ మూడు లక్షణాలు మనకు వున్నాయేమో మనకు మనమే గమనించుకుంటూ ఉండాలి.

* ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.*
***
వైరస్ జీవి కానప్పుడు అది యెట్లా వ్యాపిస్తుంది దానితో రోగం ఎందుకు వస్తుంది అనే సందేహాలు వస్తాయ్.  కాబట్టి నేను సభ్యులు అవగాహనకోసం శాస్త్రీయంగా జీవి అంటే ఏమిటి నిర్జీవి అంటే ఏమిటి కొంత వివరణ ఇవ్వ దలిచాను. మనం స్థూల దృష్టితో చుస్తే కొన్నిటిని మాత్రం జీవులుగా పరిగణిస్తాం. మనం చూసే అతి చిన్న జీవి చీమ. అంతకన్నా చిన్న జీవిని మనం చూడలేమనుకుంటా. మనం చీమ కదలటం వరుసగా నడవటం, తన ఆహారాన్ని తీసుకొని వెళ్ళటం చూస్తున్నాం. కాబట్టి మనం జీవి అంటే దానికి కొన్ని లక్షణాలను ఆపాదిస్తాం. 1) శ్వాసించటం, చలించటం, సంతానోత్పత్తి కలిగి ఉండటం. కొంతకాలం జీవించి ఉండటం, మొదలైనవి. కానీ మనం సూక్ష్మ దర్శినితో చుస్తే చీమ కన్నా చిన్న జీవులను చూడవచ్చు వాటిని బ్యాక్టీరియాలు అంటారు. ఇవి కూడా జీవులే కానీ ఇవి కంటికి కనిపించవు కానీ కొన్ని జీవ లక్షణాలు అంటే శ్వాసించటం, కదలటం, ఆహారాన్ని తీసుకోవటం,  సంతానోత్పత్తి చేయటం వంటివి ఉంటాయి. శ్వాసించటం అనేది ఎప్పుడైతే ఉంటుందో దానిని మనం కొంతమేరకు జీవిగా పరిగణలోకి తీసుకోవచ్చు.  ఈ బ్యాక్టీరియాలను మనం వేరు చేసి వుంచుతే అవి కొంత కాలానికి చనిపోతాయి. అంతే కాక అవి కొన్ని వాతావరణ పరిస్థితులలోనే జీవించి ఉండగలవు. అంటే వాటికి ప్రతికూల పరిస్థితులు ఉంటే అవి చనిపోతాయి. 

ఇక వైరస్ గూర్చి తెలుసుకుందాము. ఇది ఒక ఒక ప్రోటీన్ పొర కప్పి వున్న DNA అణువు. ఈ  DNA అనేది ప్రతి జీవి కణ కణంలో వుండే అణువులు. ఇవే  జీవి రూపం, లక్షణాలను నిర్దుష్టంగా తెలియచేసే కణాలు. ఈ .DNA అణువుకు శ్వాసించే శక్తి ఉండదు తనంత తానుగా సంతానోత్పత్తి చేసుకునే శక్తి ఉండదు. మరైతే దీనితో ప్రమాదం ఏమిటంటే అది తనకు అనుకూలమైన జీవి యెక్క జీవ కణం దొరికితే దానిలోకి తన DNA ను పంపి ఆ కణం మీద ఆధిపత్యం వహించి తన లాంటి DNA లను ప్రోటీన్ కవరులో సహా తయారు చేసుకుంటుంది. అప్పుడు ఆ జీవ కణం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది అన్ని ఈ వైరస్ కణాలే ఉంటాయి అవి మళ్ళి ఆ జీవ కణం ప్రక్క ప్రక్క వున్న కణాలను అన్నిటిని ఆక్రమించుకొని పూర్తిగా ఆ వైరస్లు గా మారతాయి. అప్పుడు ఆ నిర్దుష్ట పని చేసే జీవకణాలు పూర్తిగానశించి వాటి స్థానంలో ఈ వైరస్లు ఉంటాయి అంటే ఆ కణాలు పూర్తిగా నశిస్తాయి అప్పుడు శరీరంలో ఆ జీవ కణాలు చేసే పని పూర్తిగా స్తంభించి పోతుంది. అంటే ఈ వైరస్లు శ్వాసకోశాల కణజాలాన్ని పూర్తిగాచంపి వేసి వాటి రూపాలతో నింపుతాయి. అప్పుడు మనిషికి శ్వాసించటం కష్టమౌతుంది. అందువల్ల శరీరంలో ఆక్సిజన్ దొరక్క ప్రతి కణం నిర్జీవం అవుతుంది తుదకు మరణం సంభవిస్తుంది.  

మీకు ఒక ఉదాహరణతో ఈ విషయాన్నీ చెపుతాను (దయచేసి ఇది ఎక్కడ ప్రయోగించకండి) 
మనం స్కూటర్ నడపటానికి పెట్రోల్ వాడుతాము. ఈ పెట్రోలు ఇంజన్లోకి వెళ్లి తగులపడటం వల్ల వచ్చే శ్సక్తితో ఇంజన్ తిరుగుతుంది. అదే పెట్రోల్ ట్యాంక్లో కొంచం మనం తినే పంచదార కలిపాము అనుకోండి పెట్రోలు పెట్రోలుగానే ఉంటుంది కానీ మండే గుణం కోల్పోతుంది ఇంజను నడవదు. అలానే కణాలు తమ స్వభావమైన లక్షణాన్ని కోల్పోతాయి అన్ని వైరస్ గా మారుతాయి. 
నిజానికి ఈ వైరస్ కణం పూర్తిగా జీవి కాదు కాబట్టి దానికి శ్వాసించాలిసిన పని లేదు ఎన్ని ఏళ్ళు ఐనా అలానే ఉంటుంది. కాకపోతే దానిని ఆవరించిన ప్రోటీన్ లేయర్ కరిగేపోతే దాని ఉనికిని కోల్పోతుంది కాబట్టి మనం కొంత సేఫ్ గా వున్నాం. ప్రోటీన్ కవరు తొలగించిన  DNA అణువు ఏమి చేయలేదు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి వైరస్ అనేది రెండు భాగాలుగా వుంది. ఒకటి ప్రోటీన్ కవరు రెండు DNA ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఇంకొక దాని తోడు లేకుండా మనుషులను ఏమి చేయలేదు. కాబట్టి మనం ఈ రెండిటిని ఒకదానితో ఇంకొకటి విడదీస్తే ప్రమాదం తప్పుతుంది. ప్రోటీన్ పొర అనేది ఒక నూనె లాంటి పదార్ధం. మనం ఏరకంగా ఐతే నూనె చేతికి అంటితే సబ్బుతో కడుగుకుంటామో ఆలా మనం మన చేతిని సబ్బుతో కడుగుకుంటే ఈ ప్రోటీన్ పొర సబ్బులో కరిగిపోయి కేవలం DNA  మిగులుతుంది.  కాబట్టి అది ఏమి చేయలేదు. 

దీనికి చిన్న ఉదాహారణ చెపుతాను మిమ్మలిని ఎవరైనా తుపాకీతో బెదిరిస్తే బెదురుతారా లేదా తప్పకుండ బెదురుతారు. కానీ మీకు అతని చేతిలోని తుపాకీలో గుండ్లు లేవని తెలిస్తే. మీరు ఎట్టి పరిస్థితిలో భయపడరు. ఈ ప్రోటీన్ పొర లేని DNA గుండ్లు లేని తుపాకీ లాంటిదే కాబట్టి మనుషులను ఏమి చేయలేదు. 
**************

    *ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనని పెంచుదాం.👍 *
నలుగురికి ఈ విషయాలు తెలిసేలా పంచుదాం.

*ఈ సమాచారాన్ని మీ వద్ద మాత్రమే ఉంచవద్దు.  మీ కుటుంబం మరియు స్నేహితులందరికీ పంపించండి.

కామెంట్‌లు లేవు: