श्लोकम् :
प्रधमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनं।
तृतीये नार्जिता कीर्तिः चतुर्धे किं करिष्पति।।
శ్లోకం:
ప్రథమే నార్జితా విద్యా, ద్వితీయే నార్జితం ధనమ్।
తృతీయే నార్జితా కీర్తిః, చతుర్థే కిం కరిష్యతి॥
ప్రతిపదార్థం:
ప్రథమే= ప్రథమమందు అనగా మొదటి భాగమునందు, విద్యా = విద్య, న ఆర్జితా = సంపాదించక పోతే, ద్వితీయే = రెండవ భాగమునందు, ధనమ్ = ధనము, న ఆర్జితం = సంపాదించకపోతే, తృతీయే = మూడవ భాగమునందు, కీర్తిః = పేరు, న ఆర్జితా = సంపాదించక పేతే,చతుర్థే = నాలుగవ భాగమునందు, కిం కరిష్యతి = ఏమి చేయగలుగుతాడు?
Meaning:
In the first part of life, if a person does not acquire the education; in the second part of life, if he does not earn wealth; in the third part of life, if he does not earn fame; what can he do in the last and fourth part of life during the old age?
Meaning, it conveys that a person should have meaningful life by doing his duties at different parts of his life span. It is a guidance to all people to do the things deem appropriate at various stages of life.
తాత్పర్యం:
మొదటి దశలో విద్యని సంపాదించని వాడు, రెండవ దశలో ధనాన్ని సంపాదించని వాడు, మూడవ దశలో కీర్తిని సంపాదించని వాడు, నాలుగవ దశలో ఎమి చేయగలుగుతాడు?
ఎవరైతే జీవితంలో మొదటి భాగంలో అనగా చిన్నతనంలో విద్యను అర్జించనివాడు, రెండవ దశలో యౌవనంలో ధనాన్ని సంపాదించనివాడు, మూడవస్థితిలో నడివయస్సులో కీర్తిని పొందనివాడు, నాలుగవ అవస్థలో అనగా వృద్ధాప్యంలో ఏమి చేయగలడు? అనగా ఏమీ చేయలేడు అనగా మిగిలిన జీవిత శేషభాగంలో శరీర దారుఢ్యం తగ్గి, వయస్సు తరిగిపోతూ ఉన్న దశలో, రకరకాల ఆరోగ్య సమస్యలతో, జ్ఞాపక శక్తి తగ్గిపోయే తరుణంలో, శక్తి చాలక ఏమీ చేయగలిగే స్థితి కలిగిఉండడు కాబట్టి అన్నిటినీ సకాలంలో తన విధులని నిర్వర్తించవలెనని తాత్పర్యం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి