21, జులై 2020, మంగళవారం

కరోన ఒక అవగాహనా

 అందరికి కరోన వైరస్ గూర్చి అవగాహన ఉంది. ఎలా వ్యాపిస్తుంది, ఎలా నష్టం కలిగిస్తుంది అందరికి తెలిసిపోయింది. 

ప్రభుత్వ లెక్కల ప్రకారం 100 కి 45 % మందిలో ఎటువంటి లక్షణాలు లేవు, 40% మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయి. 12% మందిలో త్రీవ్ర లక్షణాలు, 3% మందిలో మరణాలు సంభవిస్తున్నాయి..

నా దగ్గర ఉన్న సమాచారం, నా విశ్లేషణ ప్రకారం కేసుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువ. లక్షణాలు లేకపోవడం వల్ల వారిని గుర్తించలేము, కానీ వారి ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. నాకు, మీకు ఎవరిలో వైరస్ ఉందొ లేదో కూడా చెప్పలేని స్థితి.


చనిపోయిన 25,000 మందిని గమనిస్తే..అన్ని వయసుల వారు ఉన్నారు. 

*ఈ మరణాలు అన్ని అకాల మరణాలే*. వారికి ఇతర వ్యాధులు ఉన్నంత మాత్రాన,వయసులో పెద్ద వారు అయినంత మాత్రాన, దీని బారిన పడి చనిపోవాలని సిద్ధాంతం లేదు కదా.


మరణాల శాతం తక్కువ ఉండొచ్చు. కనపడకుండా కోట్లాది కేసులు ఉండొచ్చు. వారు వీరు ఏమి చేస్తుండకపోవచ్చు. *కొందరు కరోన బాధితులు నాకు ఫోన్ చేసి వారి గోడు చెప్పుకుంటుంటే నాకే భయం వేస్తుంది* ఎవరెన్ని చెప్పిన అన్ని అందుబాటులో లేవనేది నిజము. అందుబాటులో ఉంచడం సాధ్యము కాదు అనేది నిజం.  దీనికి ఎవరిని నిందించి లాభం లేదు. ఇప్పటికిప్పుడు ఎవరు అన్నీ సృష్టించలేరు. 

అందరూ చేతులెత్తారని మనం కాళ్ళెత్తుదామా. మనల్ని మనం కాపాడుకోవాల్సిన సమయం ఇది.

1. ముఖ్యముగా 60 సంవత్సరాలు దాటిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గడప దాటకండి, ఇంటికి ఎవరిని రానివ్వకండి

2. 60 లోపు ఆరోగ్యం గా ఉన్నవారు, మీ పనులు జాగ్రత్తగా చేసుకోండి.

*సామాజిక దూరం అన్నిటికన్నా ముఖ్యం* బయటకు వెళితే, ఆఫీసులో 6 అడుగుల దూరం నుండే మాట్లాడండి. మాస్కులు, sanitiser మనల్ని కాపాడే అవకాశాలు కేవలం 30% మాత్రమే.అవి ఉన్నాయి కదా అని నిర్లక్ష్యం వద్దు. మనం మాస్కులు, sanitiser వాడే పద్దతిలో వాడుతాలేం, వాడలేము. అందుకే భౌతిక దూరమే మందు.

*కరోన వచ్చిందంటే, ఈ రోజు మీతో రాసుకు పూసుకు తిరిగిన వారెవ్వరూ మైలు దూరంలోకి కూడ రారు. అది గుర్తుంచుకోండి.*

*కనీసం కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రారు*

ఈ రోజు వరకు మనకు ఏమి కాలేదు , అదృష్టం అది. అసలు సమస్య ఇప్పుడే ఉంది. వైరస్ మన చుట్టూ వల పన్నింది. అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాని బారిన పడటం ఖాయం. కొంత కాలం మాములు పనులు వాయిదా వేసుకోండి....  అత్యవసరం కానీ ఆసుపత్రి పనులు వద్దేవద్దు.

మీరు ఇతరుల ఇంటికి పోయిన, మీరు ఇతరులను ఇంటికి రానిచ్చిన, ఎక్కువ సమయం గడిపినా మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు. *మన సన్నిహిత వ్యక్తుల నుండే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ*

సెప్టెంబర్ 1 వరకు మనల్ని మనం కాపాడుకుంటే దాదాపు బయటపడుతం. 

*మన నిర్లక్ష్యం మనల్నే కాదు మనఇంట్లో వారిని బలి చేస్తుంది*. 

దయచేసి ఇంటికే పరిమితం కండి, బయటకు వెళితే భౌతిక దూరం, మాస్కు , sanitiser ఖచ్చితంగా వాడండి. రాబోయే 4 వారాల్లో మన భవిష్యత్తు ఉంది....

అజాగ్రత్త అస్సలు వద్దు....దండం పెట్టి చెబుతున్నా 

డా౹౹వేణు గోపాల రెడ్డి.
మైక్రోబయాలజిస్టు.
ప్రిన్సిపాల్ టీఎస్ ఎం ఎస్.
వీణవంక.

కామెంట్‌లు లేవు: