*సందేహం (❓):* 💐 *నివృత్తి (✅):*
🌹🌻🌻🌻🌹🙏🙏🌹🌻🌻🌻🌹
❓ *సందేహం (?):* ❓
❓ *గణపతి అర్చనకు తులసి పనికి రాదని చాలామంది చెబుతున్నారు. కానీ వినాయకచవితినాడు తులసి వేయవచ్చు - అని కొందరంటారు. అయితే ఆ రోజు కూడా తులసి వేయరాదని చెబుతూ, 'వేయవచ్చు' అనే మాటకు ఎక్కడా ప్రమాణం లేదని ఒక పండితుడు అన్నారు.*
*గణేశ చతుర్థినాడు తులసి వేయవచ్చా!? వేయరాదా!?* ❓
✅ *నివృత్తి (√):* ✅
✍️ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు.
💫 గణేశ విధానాలకు పరమ ప్రమాణమైన గ్రంథాలలో ఒకటి *ముద్గల పురాణం.* దానిలో స్పష్టంగా ఇలా చెప్పబడి ఉంది -
💫 ఒక ప్రత్యేక కారణంగా, తులసి తన అర్చనకు పనికిరాదని గణేశుని శాపం. అటుపై తులసి పశ్చాత్తప్తురాలై గణపతి అనుగ్రహం కోసం తపస్సు నాచరించింది. అప్పుడు గణపతి ప్రత్యక్షమై, తులసీదేవికి ఎన్నో వరాలనిచ్చి, *'వినాయక చవితినాడు మాత్రమే నీ దళాలతో నన్ను పూజించవచ్చు'* అని అనుగ్రహించాడు.
*భాద్రశుక్లచతుర్య్థాం యే మహోత్సవ పరాయణాః ౹*
*పూజయిష్యంతి మాం భక్త్యా తత్ర త్వం ధారయామ్యహం ౹౹*
*ఏకవింశతి పత్రాణి హ్యర్చయిష్యంతి మానవాః ౹*
*తత్ర తే పత్రమేకం మే మాన్యం దేవి భవిష్యతి ||*
*ఉల్లంఘన సమం పాపం న భూతం న భవిష్యతి ||*
- "భాద్రపదమాసంలో వచ్చే నా చవితి మహోత్సవాలలో సమర్పించే 21 పత్రాలలోకెల్లా తులసీపత్రమే అత్యంత గొప్పదిగా నేను స్వీకరిస్తాను. కనుక ఆ రోజున 21 పత్రాలలో తులసి పత్రం కూడా నాకు సమర్పించాలి. ఆ రోజున తులసిని సమర్పించకుండా పూజిస్తే, ఆ ఉల్లంఘన దోషానికి వారు పాపులుగానే పరిగణించబడతారు.”
పై వృత్తాంత ఆధారంగా వినాయకచవితినాడు మాత్రమే తప్పకుండా తులసిని సమర్పించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి