డెత్ సర్టిఫికెట్:
ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది.
ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు.
“చూడు నాయనా! విద్యుత్ బల్బు లు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను, నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా.
అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.
ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వే లో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావు గారు ఆర్మీలో లెఫ్నె౦ట్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివ గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను"
"మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటి కి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది అయినా ఒకటే.
అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే.
ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి.
మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటి కి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి.
చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము.
ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు..
మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే..
అదే డెత్ సర్టిఫికేట్.
సేకరణ ..
గౌ.శ్రీ. జస్టిస్ ఎన్.వి.రమణ
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి